బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. మళ్లీ సీఎంగా నితీష్ కుమార్ ఉంటారన్న విషయం విదితమే. కాగా, తాను ఎన్నికల ప్రచారంలో ‘ఇవే తన చివరి ఎన్నికలు’ అనే మాట తాననలేదన్నాడు నితీష్. కావాలంటే ఆడియో, వీడియో ఫుటేజీలు పరిశీలించుకోవచ్చని సవాలు చేశాడు. మీడియా తన మాటలను వక్రీకరించిందని నితీష్ అన్నారు. తానిప్పట్లో రిటైరయ్యే అవకాశం లేదన్నాడు ఈ డైనమిక్ లీడర్. తానింకా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు.
కాగా, బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీయూ పోయినసారి ఎన్నికల్లో పొందిన సీట్ల కంటే చాలా తక్కువ సీట్లు పొందింది. తన మిత్ర పక్షం బీజేపీ మాత్రం రికార్డు స్థాయిలో సత్తా చాటడంతో జేడీయూ గట్టెక్కింది. జేడీయూ కూటమికి వ్యతిరేకంగా పోటీచేసిన ఆర్జేడీ కూటమి గెలుపుకు కొద్ది స్థానాల్లో నిలిచిపోయింది. ఆర్జేడీ తన సత్తా చాటగా.. కాంగ్రెస్ కుదేలైంది. కేవలం 19 స్థానాల్లో విజయం సాధించి అపఖ్యాతిని మూటగట్టుకుంది.