end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంఎంఐఎం బీజేపీలది చీకటి ఒప్పందం
- Advertisment -

ఎంఐఎం బీజేపీలది చీకటి ఒప్పందం

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్: ఎంఐఎం, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం గాంధీభవన్‌లో మాట్లాడిన ఆయన.. ఎన్నికల్లో హైదరాబాద్‌ వరదలపై చర్చ జరగకుండా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేశాయన్నారు. కాంగ్రెస్‌కు రావాల్సిన ఓట్లను చీల్చి ఎంఐఎం గెలిచేందుకు బీజేపీ సహకరిస్తోందన్నారు. సచివాలయంలో మసీదును కూల్చితే ఎంఐఎం ఏం చేసిందని రేంవంత్‌ ఈ సందర్భంగా ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారని, తమ ఎంపీలు, ఎమ్మెల్యేలు లాక్కొని కాంగ్రెస్‌ను బలహీనం చేయాలని, తెలంగాణ మైదానంలో ఏ రాజకీయ పార్టీ లేకుండా చేయాలని చూశారన్నారు. కేసీఆర్‌ అరాచకంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారన్నారు. ప్రజలకు రాజకీయాలను అసహ్యం కలిగేలా చేశారన్నారు.

తమ నాయకత్వాన్ని కొనుగోలు చేసినా ప్రజల్లో కాంగ్రెస్‌ బలహీనపడలేదని ఈ సందర్భగా రేవంత్ గుర్తు చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణ ప్రమాదంలో పడిందని, మతవిద్వేషాలకు కేసీఆర్‌ బాధ్యత వహించాలన్నారు. అమిత్‌షా మాటల్లో రాజకీయ దురాలోచన కనిపిస్తోందని, బీజేపీకి రెండు సార్లు అధికారమిస్తే హైదరాబాద్‌కు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రం చేయలేని పని ఓ కార్పొరేటర్ చేస్తాడా? అని బీజేపీని రేవంత్‌ సూటిగా ప్రశ్నించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -