end

సముద్రమట్టానికి 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండా

దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీసులు భారత్‌- చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను రెపరెపలాడించారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 16వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. లడఖ్‌లోనూ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది సముద్రమట్టానికి 18వేల అడుగుల ఎత్తులో జాతీయ జెండా ఎగువేశారు. భారత్‌ మాతాకీ జై నినాదాలతో హిమాలయ పర్వతాలు దద్దరిల్లాయి.

Exit mobile version