end

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావు ప్రగతి భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. 72వ గణతంత్ర వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. మహనీయుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. సీఎం రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోశ్‌ కుమార్‌, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మతోపాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Exit mobile version