end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Japanese old man:పోలీసులకు చుక్కలు చూపించిన వృద్ధుడు
- Advertisment -

Japanese old man:పోలీసులకు చుక్కలు చూపించిన వృద్ధుడు

- Advertisment -
- Advertisment -
  • 2060 సార్లు ఫోన్ చేసి టార్చర్ చేసిన 67 ఏళ్ల వ్యక్తి


ఓ జపనీస్ వృద్ధుడు (Japanese old man) పోలీసులకు టార్చర్ (Police torture) చూపించాడు. తొమ్మిది రోజుల్లో 2,060సార్లు ఫోన్ (call) చేసి బూతుల (vulgar) వర్షం కురిపించాడు. టాక్స్ దొంగలు, స్టుపిడ్స్ (Stupids) అంటూ ప్రతీ ఆరు నిమిషాలకు ఓసారి కాల్ చేసి వేధించాడు. ఇంతకీ ఈ వ్యక్తి ఎందుకిలా చేశాడో కారణం ఇంకా తెలియనప్పటికీ.. ఆయన మిషన్ పట్ల కమిట్మెంట్‌ (Commitment)కు కాంప్లిమెంట్స్ (Compliments)ఇస్తున్నారు నెటిజన్స్.

సైతామా ప్రిఫెక్చర్‌కు(Saitama Prefecture) చెందిన 67 ఏళ్ల వ్యక్తి సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 మధ్య ప్రిఫెక్చురల్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌ (Prefectural Police Headquarters)కు మొత్తం 2060 ఫోన్ చేసి సిబ్బందిపై అరిచాడు. వారందరినీ జాబ్ నుంచి తొలగిస్తే కానీ బుద్ధి రాదంటూ కేకలు వేశాడు. తొమ్మిది రోజుల వ్యవధిలో రిపీట్ కాల్స్‌తో పోలీసులకు చుక్కలు చూపించగా.. అతని ఇంటిపై దాడి చేసి అరెస్ట్ (Arrest) చేశారు. పోలీసుల పనిని అడ్డుకున్నాడనే కారణంతో కేసు పెట్టారు. కాగా ఈ ఆరోపణలను అంగీకరించిన వృద్ధుడు.. పోలీసులు ఏదో ఒక రోజు తన గురించి వస్తారని తెలుసని, దానికి ఎప్పుడో సిద్ధమైపోయానని చెప్పాడు.ప్రస్తుతం ఈ విచిత్రమైన కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా.. పోలీసులకు సహకరించేందుకు ఇంట్రెస్ట్ చూపట్లేదు వృద్ధుడు. అసలు ఇలా చేసేందుకు కారణమేంటో చెప్పేందుకు కూడా ఆసక్తి కనబరచట్లేదు. ఇక మరో విషయం ఏంటంటే.. ఈ వ్యక్తి ఫోన్ రికార్డుల ప్రకారం, అతను చాలా సంవత్సరాలుగా పోలీసులకు కాల్ చేస్తున్నాడు. కానీ కొన్ని రహస్య కారణాల వల్ల ఇటీవలే తన ఆపరేషన్‌ను వేగవంతం చేశాడు.

(Ongole:కౌన్సిలర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -