end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌లైఫ్‌Doctor:అత్యంత వృద్ధ డాక్టర్..
- Advertisment -

Doctor:అత్యంత వృద్ధ డాక్టర్..

- Advertisment -
- Advertisment -

100 ఏళ్లు దాటినా ఆగని వైద్య సేవలు

గిన్నిస్‌ రికార్డు సృష్టించిన ‘హోవార్డ్ టక్కర్’

అమెరికా (America)లోని ఒహియో (Ohio) చెందిన 100 ఏళ్ల వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత వృద్ధ వైద్యుడిగా (elderly physician) గిన్నిస్‌ రికార్డు (Guinness record) సృష్టించాడు. అంతేకాదు ఇప్పటికి కూడా తనకు సర్వీస్ (service) నుంచి రిటైర్ (Retire) అయ్యే ఆలోచన లేదని చెప్తున్నాడు. క్లీవ్‌ల్యాండ్‌ (Cleveland) నివాసి అయిన ‘హోవార్డ్ టక్కర్’ (Howard Tucker) గతేడాది ఫిబ్రవరి లోనే వరల్డ్ ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌ (World Oldest Practicing Doctor)గా గుర్తింపు పొందాడు. అప్పుడు ఆయన వయస్సు (age) 98 ఏళ్ల 231 రోజులు కాగా.. ఇప్పుడు సెంచిరీ (century) క్రాస్ చేసినప్పటికీ పూర్తి సమయం వైద్య వృత్తి (Medical profession)కే కేటాయిస్తున్నాడు.

ఈ ఏడాది జులైలో 100వ పుట్టినరోజు (birthday) తర్వాత హోవార్డ్ కొవిడ్ (Covid) బారినపడ్డాడు. అయితే కోలుకుంటున్న క్రమంలోనూ జూమ్ ద్వారా తన రెసిడెంట్స్‌కు (residents) బోధించడం (teaching)ఆపలేదు. ఆ సమయంలో ఈ న్యూరాలజిస్ట్ (Neurologist) ఆరోగ్య పరిస్థితి ‘రిస్క్’ (risk)లో పడినప్పటికీ సాధారణ దినచర్యనే పాటించాడు. ఎందుకంటే రోగులకు చికిత్స (Treatment of patients) చేయడాన్ని అతను అంతగా ఇష్టపడతాడు. ఇక తాను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను (title) పొందడాన్ని ఒక గౌరవంగా (respect) భావిస్తున్నట్లు తెలిపిన టక్కర్.. సుదీర్ఘ, సంతృప్తికర, సంతోషకరమైన జీవితంలో ఆ అవార్డ్‌ను మరొక విజయం (success)గా పేర్కొన్నారు. ఇక టక్కర్‌తో పాటు అతని భార్య స్యూ(89) కూడా ఇప్పటికీ సైకో అనలిస్ట్‌ (Psychoanalyst)గా ప్రాక్టీస్ (practices) చేస్తోంది. 

‘రిటైర్మెంట్‌ను (retirement)దీర్ఘాయువుకు శత్రువ ని నమ్ముతున్నాను. నా యవ్వనంలో (young age) కూడా నేనెప్పుడూ పదవీ విరమణ గురించి ఆలోచించలేదు’ అని అనుభవజ్ఞుడైన వైద్యుడు చెప్పాడు. చేసే పనిని ఇష్టపడి ఇంకా చేయగలిగినప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఏమిటని? ఆయన ప్రశ్నిస్తున్నారు. 10 జులై 1922న జన్మించిన టక్కర్ రెండో ప్రపంచ యుద్ధ (second world war)సమయంలో US నావికాదళం (In the Navy)లో, 1950లలో కొరియన్ (Korean) యుద్ధం లో అట్లాంటిక్ ఫ్లీట్‌ (Atlantic Fleet)కు న్యూరాలజీ చీఫ్‌ (Chief of Neurology)గా పనిచేశాడు.

(Horizon… వినికిడి విజయం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -