end
=
Sunday, January 19, 2025
సినీమాదక్షిణాది నుంచి ఒకే ఒక్కడు
- Advertisment -

దక్షిణాది నుంచి ఒకే ఒక్కడు

- Advertisment -
- Advertisment -

టాలీవుడ్ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్, స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలయికలో వచ్చిన మూవీ ‘అలవైకుంఠపురములో’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ డూపర్‌ హిట్‌ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద కనకవర్షం కురిపించిన ఈ మూవీ సోషల్‌మీడియాలోనూ సూపర్ ఫాలోయింగ్‌ను సాధించింది. ఆ సినిమాలోని అన్ని పాటలు బంపర్ హిట్అ య్యాయి. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్‌ దేశ, విదేశాల్లోనూ మార్మోగిపోయింది.

కాగా, ఈ సినిమా మరో ఘనత సాధించింది. ఇండియన్‌ సినిమాల్లో ఈ ఏడాది అత్యధిక వ్యూస్‌ సాధించిన టాప్‌-20 ట్రైలర్ల జాబితాలో చోటు దక్కించుకుంది. దక్షిణాది నుంచి ఈ ఒక్క సినిమా మాత్రమే ఈ ఘనత సాధించడం విశేషం. అల్లు అర్జున్‌కు తెలుగుతో పాటు మళయాలం, కన్నడలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్‌కు సోషల్‌ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన సౌత్‌ హీరోగా అర్జున్‌ ఇటీవలే రికార్దు సృష్టించాడు. ప్రస్తుతం ఆయన సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -