- తీర్పు వెలువరించిన అడ్వయిజరీ బోర్డు
BJP MLA Rajasingh : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గట్టి షాక్ తగిలింది. మతవిద్వేషణలు, మతవిద్వేషపూరిత ప్రసంగాలు(Communal Hate Speech), మతాల విశ్వాసాలను ఉద్దేశించి మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయనపై అప్పట్లో పీడీయాక్ట్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ తపై ఉన్న పీడీయాక్ట్‌ను(PDAct) ఎత్తివేయాలన్న విజ్ఞప్తిని అడ్వైజరీబోర్డు తిరస్కరించింది(Rejected). ఈ కేసును పరిశీలించిన బోర్డు విచారణ చేపట్టింది. పోలీసులు(Hyderabad Police) విధించిన పీడీయాక్ట్‌ను సమర్థిస్తూ బుధవారం పీడీయాక్టు బోర్డు తీర్పు వెలువరించింది. రాజాసింగ్ విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే ఇప్పటికే రాజాసింగ్‌పై చాలా కేసులు నమోదైయ్యాయి. 101 కేసులు ఉన్నట్లు పోలీసులు కమిటీ వివరించింది. కాగా అందులో మతాన్ని రెచ్చగొట్టేలా (religious hatred), మత విద్వేష పూరిత కేసులు 18 ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు పీడీయాక్ట్ అడ్వజరీ బోర్డుకు విన్నవించారు. దీంతో బోర్డు రాజాసింగ్‌పై పీడీయాక్ట్‌ను ఇప్పుడే ఎత్తివేయలేమని తీర్పు వెలువరించింది. మున్ముందు ఇంకా విచారణలు జరగాల్సి ఉందని అప్పుడే తుది నిర్ణయానికి రాలేమని బోర్డు తెలిపింది.

(Harish Rao:యాదవ – కురమల సభలో మంత్రి హరీశ్ రావు)