న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని, దివంగత నేత అటల్ బిహారి వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్తల్‌లో ఆయన సమాది వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, నిర్మలా సీతారామన్, పియూష్ గోయల్‌లు హాజరై వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ లోక్‌సభ సెక్రటరియట్ రచించిన ‘అటల్ బిహారి వాజ్‌పేయి ఇన్ పార్లమెంట్ : కొమెమొరేటివ్ వాల్యూమ్’ పుస్తకాన్ని నేడు పార్లమెంట్‌లో రిలీజ్ చేయనున్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్ వేదికగా వాజ్‌పేయి చేసిన ప్రసంగాలతో పాటు ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య అంశాలను ఈ పుస్తకంలో ప్రచురించారు.