end

తెలుగు ఇండస్ట్రి యువరాజు

హిప్పీ బర్త్డే సూప‌ర్ స్టార్‌. సూప‌ర్ స్టార్‌గా, ప్రొడ్యూస‌ర్‌గా, బ్రాండ్‌ అంబాసిడర్‌గా, వ్యాపారవేత్తగా, భర్తగా, నాన్నగా, తండ్రికి తగ్గ తనయుడిగా, సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తిగా ఇలా అన్నింటా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న మహేశ్‌ నిజంగా సూపర్‌స్టారే కాదు మ‌న‌సున్న మ‌హ‌ర్షి కూడా. అన్నిచోట్ల సక్సెస్‌ కావడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు. కొందరికే సాధ్యం అవుతుంది. ఆ కొందరిలో ఒకరైన సూపర్‌స్టార్‌ మహేశ్‌ పుట్టినరోజు ఆగస్ట్‌ 9. ఇలాంటి పుట్టినరోజులను ఆయన మరెన్నింటినో సెలబ్రేట్‌ చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆయన హీరోగా నటించిన 27 సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు సినిమాలు ఒకటి త్రివిక్రమ్ దర్శకత్వంలో మరొకటి రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్నాయి.

సూప‌ర్ స్టార్ అనే ప‌దం విన‌టానికి బాగానే ఉంటుంది. కానీ అదొక బాధ్యత‌. టాలీవుడ్ చరిత్రలో సూప‌ర్‌స్టార్ కృష్ణ ఓ అధ్యాయం. ఎన్నో వైవిధ్యమైన సినిమాల‌ను చేశారు. ఆయ‌న కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసిన మ‌హేష్ బాబు.ఆయ‌న అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ అభిమానులను, ప్రేక్షకుల‌ను మెప్పించేలా ఆకట్టుకునేలా సినిమాలు చేయ‌డం సాధార‌ణ విష‌యం కాదు. ఓ వైపు కుటుంబం మ‌రో వైపు ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్న మ‌హేష్‌.అంతేకాకుండా స‌మాజానికి తన వంతుగా సేవ‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ స్టార్ డ‌మ్‌ను క్యారీ చేయ‌టంలో మ‌హేష్ ఎన్నో ఒడిదొడుకులు చాలా సులభంగా ఎదుర్కొన్నారు. నీడ సినిమాలో చిన్నప్పుడే మ‌హేష్ సినిమాల్లో అడుగు పెట్టారు. త‌ర్వాత పోరాటం, శంఖారావం, బ‌జార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢ‌చారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా త‌మ్ముడు, బాల చంద్రుడు వంటి సినిమాల్లో న‌టించి మెప్పించారు మ‌హేష్‌. అయితే చ‌దువును అశ్రద్ద చేయ‌కూడ‌ద‌నే కార‌ణంగా తండ్రికిచ్చిన మాట కోసం కొన్నాళ్లు పాటు సినీ రంగానికి దూరంగా ఉన్నారు. చ‌దువు పూర్తి కాగానే ఘ‌ట్టమ‌నేని న‌ట వార‌సుడిగా అంత‌కు ముందు ఉన్న కృష్ణ ఆశ‌ల‌ను, ఆశ‌యాల‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యత‌ల‌ను తన భుజాల‌కెత్తుకున్నారు ప్రిన్స్ మ‌హేష్‌.

Exit mobile version