end

ఈ ఎగ్జయిట్‌మెంట్‌కు కారణం దాదానే

  • ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌

ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆట మామూలుగా ఉండదు. రెండు జట్లు తలపడుతున్నప్పుడు ఆట ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే ఇరుదేశాల అభిమానులు యుద్ధం జరుతున్నంత సీరియస్‌గా చూస్తారు. అయితే పాక్‌ తర్వాత భారత అభిమానులకు భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫుల్‌ ఎగ్జైట్‌మెంట్‌ కలిగిస్తుంది. ఆటగాళ్ల కవ్వింపులు, సరదా మాట్లు, ఓ సమయంలో సీరియస్‌ అవ్వడం అంతా ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో భాగమయ్యాయి. అయితే ఇలా ఈ రెండు జట్ల మధ్య ఇంత వైరం పెరగడానికి గానీ, ఇంత ఇంట్రెస్ట్‌గా మారడం కోసం ప్రధాన కారణం భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీనే అట. ఈ విషయాన్ని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ ఇటీవల తెలిపాడు. గతంలో వేరే దేశాలు ఆస్ట్రేలియా టూర్లకు వచ్చినప్పుడు ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసేవారు. అలాగే భారత్ నుంచి

అంతకు ముందు వచ్చిన ఏ కెప్టెనూ ఈ స్లెడ్జింగ్‌కు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. కానీ గంగూలీ మాత్రం తనే మాటలతో రెచ్చగొట్టేవాడని హాగ్ చెప్పాడు. ‘ఓసారి టాస్ వేస్తున్నప్పుడు మా జట్టు కెప్టెన్ స్టీవ్ వా కొంచెం లేట్‌గా వచ్చాడు. అంతే గంగూలీ వెంటనే నోటికి పని కల్పించాడు. స్టీవ్ వాపై ఓ రేంజ్‌లో కామెంట్లు చేశాడు’ అని హాగ్ గుర్తు చేసుకున్నాడు. ఇలా మాటల యుద్ధానికి దిగిన తొలి భారత కెప్టెన్ గంగూలీనే అని, అతని వల్లే ఇరు జట్ల మధ్య ప్రస్తుతం అద్భుతమైన క్రీడా వైరం ఉందని హాగ్ చెప్పాడు. హాగ్ మాటలను బట్టి చూస్తే.. దాదా కారణంగానే ప్రస్తుతం మనం ఇంత ఎగ్జయిటింగ్ సిరీసులు చూడగలుగుతున్నామని అనిపిస్తోంది.

గంగూలీ తర్వాత ఆటతో పాటు మాటలతోనూ సమాధానం చెప్పగల ఆటగాడు, కెప్టెన్‌ ఎవరంటే ఠక్కున గుర్తుచ్చే పేరు విరాట్‌ కోహ్లి. కోహ్లి మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత సిరీస్‌లో భారత ఆటగాళ్లను ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ తమ వెకిలి చేష్టలతో, జాత్యంహకార వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. అందుకు గాను ఆసీస్‌ ఆటగాళ్లు, క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) టీమిండియాకు క్షమాపణలు చెప్పింది. ఈ అంశంపై ఐసీసీ దర్యాప్తు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో కోహ్లి మైదానంలో ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని భారత అభిమానులు, క్రికెట్‌ విశ్లేషకులు అంటున్నారు.

Exit mobile version