end
=
Wednesday, January 22, 2025
సినీమారికార్డు సృష్టించిన తారకరాముడు..
- Advertisment -

రికార్డు సృష్టించిన తారకరాముడు..

- Advertisment -
- Advertisment -

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘రౌద్రం రణం రుధిరం'(ఆర్‌ఆర్‌ఆర్‌). టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే అతిపెద్ద మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తారక్‌ కొమ్రం భీంగా కనిపించనుండగా.. రామ్‌ చరణ్‌ తేజ్‌ అల్లూరి సీతారామరాజుగా తెరపై వెలగనున్నాడు. కాగా, ఇప్పటికే చరణ్‌(రామరాజు) ఫస్ట్‌లుక్‌, టీజర్‌ రిలీజవగా.. సోషల్‌ మీడియాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అనంతరం, భీం(ఎన్టీఆర్‌) టీజర్‌ను రిలీజ్‌ చేయగా ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత వేగంగా 1మిలియన్‌ వ్యూస్‌ సాధించిన టీజర్‌గా, లక్ష కామెంట్లు పొందిన మొదటి టీజర్‌గా నిలిచి.. రికార్డు సృష్టించింది. అంతేగాక, 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్‌గా నిలిచింది. డీవివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు గ్రేట్‌ మ్యుజీషియన్‌ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -