జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయింది. తొలిరౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో మాత్రం బీజేపీ మొదటి స్థానంలో ఉండగా, టీఆర్ఎస్ మాత్రం రెండో స్థానానికి పడిపోయింది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,926 కాగా.. ఇందులో దాదాపు 40 శాతం ఓట్లు చెల్లలేదు. ఇంకా 34 లక్షలకు పైగా ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఆర్‌సీపురం, పటాన్‌చెరు డివిజన్లలో టీఆర్ఎస్ముం దంజలో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో బీజేపీ.. అధికార టీఆర్ఎస్‌కు అందని స్పీడ్‌లో దూసుకెళ్లినప్పటికీ ‘కారు’ పార్టీనే తొలి రౌండ్‌లో లీడ్‌లో ఉంది. బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్లిన బీజేపీ అదే ఊపును తుది ఫలితం వరకూ కంటిన్యూ చేయలేకపోయింది.
కాగా, తొలిరౌండ్ ముగిసే సరికి అధికార టీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒక్కో డివిజన్‌ను గెలుచుకున్నాయి. టీఆర్‌ఎస్ 39 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా, బీజేపీ 22, ఎంఐఎం 18, కాంగ్రెస్ 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.