end

Scary Doll:అత్యంత భయంకరమైన బొమ్మ..

  • హాంటెడ్ డాల్‌‌గా పేరుగాంచిన ‘రాబర్ట్ ది డాల్’
  • కీ వెస్ట్‌, ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియంలో ప్రదర్శన

ప్రపంచంలో అత్యంత భయంకరమైన హాంటెడ్ డాల్‌ (Scary haunted doll)గా ‘రాబర్ట్ ది డాల్’ (‘Robert the Doll’)పేరు పొందింది. కారు (Car Accident) ప్రమాదాల నుంచి విడాకుల (divorce)వరకు అనేక సంఘటనలకు కారణమైన ఈ బొమ్మ (doll) కలిగించే అనర్థాల గురించి చాలా మంది ఏకీభవిస్తుండగా.. ఇది 1905లో ఒక పనిమనిషి నుంచి రాబర్ట్ యూజీన్ ఒట్టోకు (To Robert Eugene Otto) బహుమతిగా (gift)అందించబడింది. ‘జీన్’ (‘Jean’)అని కూడా పిలువబడే రాబర్ట్ ఆ బొమ్మను ఎంతగానో ఇష్టపడ్డాడు కాబట్టి తనంత ఎత్తుగల బొమ్మకు తన పేరే పెట్టాడు. అదే బొమ్మను తన సొంత ఇల్లుగా చేసుకుని, దానికి బొమ్మల నుంచి ఫర్నిచర్ (furniture)వరకు, అలాగే టెడ్డీ బేర్ (Teddy bear)కూడా సమకూర్చాడు. ఇక జీన్ తను వెళ్లిన ప్రతిచోటుకు బొమ్మను కూడా తీసుకెళ్తూ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా మారిపోయారు.

అయితే, జీన్ ఇంటి సభ్యులతో పాటు బయటి వ్యక్తులు బొమ్మ విషయంలో ఏదో తేడాను గమనించడం ప్రారంభించారు. జీన్ ఇంటి ముందు వీధిలో నడుస్తున్నప్పుడు, ఆ బొమ్మ కిటికీకి (window)ఒక వైపు నుంచి మరొక వైపునకు మారడాన్ని స్థానికులు చూశారు. అలాగే, ఇంటి (house) లోపల, ఇంటి చుట్టూ అదే స్వయంగా కదిలింది (move). అంతేకాదు గదిలో సంభాషణలు వింటున్నప్పుడు సైతం ఆ బొమ్మ ముఖ కవళికలు మారుతాయని చాలా మంది పేర్కొన్నారు.

జీన్ భార్య (Wife)ఆ బొమ్మను ద్వేషించినప్పటికీ.. అతను మాత్రం దాన్ని తన జీవితంలో ఒక భాగం (A part of life)గా చేసుకున్నాడు. ఇక జీన్, అతని భార్య మరణం తర్వాత ఒట్టో ఇంటిని మిర్టిల్ రాయిటర్ (Myrtle Reuter)కొనుగోలు చేసింది. ఆమె రాబర్ట్ సంరక్షకురాలు. అక్కడికి వచ్చిన చాలా మంది సందర్శకులు బొమ్మ అడుగు శబ్దాలు (sounds), ముసిముసి నవ్వులు (smiles)విన్నామని పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ రాబర్ట్‌ డాల్ విరాళం ఇవ్వబడగా.. దానితో పాటు టెడ్డీ బేర్‌‌ను కీ వెస్ట్‌ (Key West), ఫోర్ట్ ఈస్ట్ మార్టెల్లో మ్యూజియం (Fort East Martello Museum) లోని ఒక గ్లాస్ కేస్‌ (Glass case)లో ఉంచారు. ఇప్పుడు మ్యూజియం క్యూరేటర్ ‘కోరి కన్వర్టిటో’ రాబర్ట్‌ (Museum Curator ‘Cory Convertito’ Robert)కు కేర్‌టేకర్ (Care tacker). ప్రతి ఏటా ఆమె దాన్ని బయటకు తీసి, గడ్డితో నిండిన శరీరాన్ని వాతావరణం ప్రభావితం చేసిందో లేదో చెక్ చేసి సరిచేస్తుంది.

రాబర్ట్ చుట్టూ ప్రచారంలో ఉన్న హాంటెడ్ (Hunted)) కథల గురించి ప్రస్తావించిన కన్వర్టిటో (Convertito).. ‘నాకు తెలియదు. దానితో నాకు ఎప్పుడూ చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదు. రాబర్ట్‌తో నాది బేసిక్ రిలేషన్‌షిప్ (Basic relation) మాత్రమే. ఆ బాడీకి ఏదైనా చేయాల్సి వస్తే.. ఆ పని కొనసాగించడానికి నన్ను అనుమతిస్తాడు’ అని పేర్కొంది.

(Group 4 Notification:తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌!)

Exit mobile version