end

SEC విపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు

  • వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖ: స్టేట్‌ ఎలెక్షన్‌ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమర్‌ ప్రతిపక్షమైన టీడీపీకి, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఓ ప్రభుత్వ అధికారి ఇలా రాజకీయాల్లో పరోక్షంగా దూరి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే ఊరకునేది లేదని హితవు పలికారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ గుర్తులుండవని చెప్పారు. అయితే మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయసాయి మండిపడ్డారు. గతంలో నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు నిలిపివేశారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version