- పాకిస్తాన్‌పై 26 పరుగుల తేడాతో ఘన విజయం
- మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో ముందంజ
ఇంగ్లాండ్- పాకిస్తాన్(England- Pakistan) మధ్య జరిగిన టెస్ట సిరీస్(Test Series)లో భాగంగా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చతికిల పడింది. విజయానికి 26 పరుగుల దూరంలో చేతులేత్తేసింది. దీంతో పాక్ ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయి సిరీస్‌ను చేజార్చుకుంది. మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0తో ముందంజలో ఉంది. ముల్తాన్(Multan) వేదికగా సోమవారం రెండో టెస్టు నాలుగో రోజున ఇంగ్లాండ్ బౌలర్లు విజృభించడంతో లంచ్ తర్వాత కాసేపటికే ఆతిథ్య జట్టు 328 పరుగులకే కుప్పకూలిపోయింది. పాక్ బ్యాటర్లు సౌద్ షకీల్(94), మహ్మద్ నవాజ్(65)లు ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ 12 ఓవర్ల వ్యవధిలో పాక్ చివరి 5 వికెట్లను కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ (4/65), జేమ్స్ అండర్సన్, ర్యాబిన్సన్ చెరో రెండో వికెట్ల(Two Wickets)తో రాణించారు.
అంతకుముందు మొదటి ఇన్నింగ్స్‌లో పాక్ బౌలర్ అబ్రర్ అహ్మద్(Pakistan bowler Abrar Ahmed)(7/114) విజృంభణతో ఇంగ్లాండ్ 281 పరుగులకు ఆలౌటైన(Allout) సంగతి తెలిసిందే. ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 202 పరుగులకు అలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 79 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బ్రూక్ సెంచరీ(Century) చేసినప్పటికీ స్టోక్స్ సేన 275 పరుగులకే అలౌటైంది. 354 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన పాక్ విజయానికి 26 పరుగుల ముంగిట బోల్తా పడింది. దీంతో స్టోక్స్ సేన సంబరాల్లో మునిగిపోయింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యరీ బ్రూక్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్(Man of the match) అవార్డు వరించింది. పాక్ బౌలర్ అబ్రర్ రెండు ఇన్నింగ్సులో కలిపి 11 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వరల్ట్ టెస్ట్ ఛాంపియన్(World Test Champion) పాయింట్ల పట్టికలో ఇంగ్లాండ్ 5, పాకిస్తాన్ 6వ స్థానంలో ఉన్నాయి.