- ఆసీస్‌పై 6 వికేట్ల తేడాతో గెలుపొందిన భారత్
- ఫేవరేట్ స్టేడియంలో విరాట్ విశ్వరూపం
- భారీ షాట్లతో విరుచుకుపడ్డ సూర్య కుమార్
- సిక్సర్ల మోతతో ఉర్రూతలూగిన ఉప్పల్ స్టేడియం
India Vs Australia : భారత్ – ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కింగ్ కోహ్లీ విశ్వరూపం, సూర్య కుమార్ సిక్సులతో ఉప్పల్ స్టేడియం మారుమోగిపోయింది. ఇక 2-1 తేడాతో భారత్ ఈ సిరీస్‌ను కైవసం చేసుకుని ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్‌కు సన్నద్ధమైంది. మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకోగా.. ఆస్ట్రేలియా 187 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముదుంచింది. ఆసిస్ జట్టులో ఓపెనర్ కామెరూన్ గ్రీన్ (52), టిమ్ డేవిడ్ (54) ధాటిగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. (టీమిండియా సారథి రోహిత్ శర్మ) అయినప్పటికీ మొదటినుంచి ధాటిగా ఆడిన భారత్ బ్యాటర్లు నాలుగు వికెట్ల నష్టానికి ఒక బంతి మిగిలి ఉండగానే ( 19.5 ఓవర్లలో) 187 మ్యాచ్ ఫినిష్ చేశారు. సూర్యకుమార్ 69 పరుగులు చేసి అవుటవగా.. విరాట్ కోహ్లీ 63 పరుగుల తర్వాత భారీ షాట్ ఆడబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేష్ కార్తిక్‌తో కలిసి హర్దిక్ పాండ్యా 25 (నాటౌట్) టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
మొదటి ఓవర్‌లోనే కేఎల్ రాహుల్ (1)పరుగు చేసి అవుటవగా.. లక్ష్య ఛేదనలో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఆ తర్వాత కొన్ని మంచి షాట్లు ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ (17) కూడా పెవిలియన్ బాటపట్టాడు. (మిస్టర్ కూల్’ రహస్యం చెప్పేసిన ధోని)ఈ క్రమంలో కోహ్లీతో జతకలిసిన సూర్యకుమార్ యాదవ్ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. సూర్య అవుటైన తర్వాత ఆసీస్ బౌలర్లు, ఫీల్డర్లు కట్టడి చేయడంతో ఉత్కంఠ నెలకొంది. ఆసీస్ బౌలర్లలో డానియల్ శామ్స్ 2 వికెట్లు తీసుకోగా.. జోష్ హాజిల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ చెరో వికెట్ తీశారు.
ఈ మేరకు మాజీ సారథికి బాగా కలిసొచ్చిన మైదానాల్లో ఉప్పల్ స్టేడియం కూడా ఒకటిగా నిలిచింది. ఇక్కడ కోహ్లి 3 ఫార్మాట్‌లలో కలిపి 8 మ్యాచ్‌లు అంటే 3 టెస్టులు, 4 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. ఇందులో 1 సెంచరీ, 3 అర్ధ సెంచరీలు చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌ల్లో 607 పరుగులు సాధించాడు. ఇక చివరిసారి అంటే 2019లో వెస్టిండీస్‌తో ఇక్కడ జరిగిన టీ20 మ్యాచ్‌లో విరాట్ 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించగా.. ఈ మ్యాచ్‌లో 48 బంతుల్లో‘4ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 63 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్‌లో మొత్త 10 ఓవర్లు వేసి 8 వికేట్లు తీసుకున్న అక్షర్ పటేలుకు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్టు రాగా.. సూర్య కుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.
* టీ20లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్లలో టాప్ ప్లేస్‌లో మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ (42) ఉండగా.. రోహిత్ శర్మ (30) రెండో స్థానానికి చేరాడు. విరాట్ కోహ్లి (32)ని అదిగమించాడు. 2001 తర్వాత భారత్ 14 మ్యాచుల్లో చేదన చేస్తే 13 మ్యాచ్ ల్లో విజయం సాధించింది.
* ఆస్ట్రేలియాపై అది నాలుగో రన్ చేజ్ 187/4 ఇంతకుముందు రాజ్ కోట్ (2018)లో 202 పరుగులు, సిడ్నీ (2016)లో 198 పరుగులు, సిడ్నీ (2020)లో 185 పరుగులను భారత్ చేజ్ చేసింది.
ఇదిలావుంటే.. సెప్టెంబర్ 28నుంచి సౌత్ ఆఫ్రీకాతో మూడు టీ20లు ఆడనుండగా.. ఇప్పటికే సౌత్ ఆఫ్రీకా జట్టు భారత్ చేరుకుంది. మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 28 తిరువానంతపురం, రెండో మ్యాచ్ గౌహతీలో, చివరి టీ20 ఇండోర్‌లో తలపడనున్నాయి. ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత్ 2022 టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా బయలుదేరనుంది.