end
=
Monday, January 20, 2025
వార్తలుజాతీయంఏలూరులో సద్దుమణిగిన పరిస్థితి
- Advertisment -

ఏలూరులో సద్దుమణిగిన పరిస్థితి

- Advertisment -
- Advertisment -

ఏలూరు: గత కొన్ని రోజులుగా ఏలూరు ప్రజలు అంతుచిక్కని వ్యాధితో నరకయాతన అనుభవించిన విషయం తెలిసిందే. చిన్నారులు, పెద్దవారు కూడా మూర్ఛపోయినట్లు, ఫిట్స్‌తో నరకయాతన అనుభవించారు. కాగా, ఏలూరు నగరంలో ఆదివారం వింత వ్యాధి కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నెల ఐదో తేదీ శనివారం మధ్యాహ్నం మొదలైన కేసుల పరంపర.. 12వ తేదీ శనివారం వరకు కొనసాగింది. అకస్మాత్తుగా కిందపడిపోయి.. మూర్చతో నురగలు కక్కుతూ.. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఎనిమిది రోజుల్లో 615 మంది వింత వ్యాధి బారినపడ్డారు. ఒకరు మరణించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు రిఫర్‌ చేసిన 35 మందిలో 29 మంది డిశ్చార్జ్‌ కాగా, విజయవాడలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారు. ఏలూరులో ఆదివారం ఒక్క కేసూ నమోదు కాకపోవడంతోపాటు వార్డు సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులకూ ఒక్కరు కూడా రాలేదు. దీంతో ప్రజలు, అధికారులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర భయాందోళనలకు గురి చేసిన అంతు చిక్కని నగరంలో ఆదివారం వింత వ్యాధి కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారంతా డిశ్చార్జ్‌ అయ్యారు.

ఈ నెల ఐదో తేదీ శనివారం మధ్యాహ్నం మొదలైన కేసుల పరంపర.. 12వ తేదీ శనివారం వరకు కొనసాగింది. అకస్మాత్తుగా కిందపడిపోయి.. మూర్చతో నురగలు కక్కుతూ.. వాంతులు చేసుకుంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఎనిమిది రోజుల్లో 615 మంది వింత వ్యాధి బారినపడ్డారు. ఒకరు మరణించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు ఆదివారం ఉదయం డిశ్చార్జి అయ్యారు. విజయవాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రులకు రిఫర్‌ చేసిన 35 మందిలో 29 మంది డిశ్చార్జ్‌ కాగా, విజయవాడలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. వీరిని కూడా సోమవారం డిశ్చార్జ్‌ చేస్తారు. ఏలూరులో ఆదివారం ఒక్క కేసూ నమోదు కాకపోవడంతోపాటు వార్డు సచివాలయాల వద్ద ఏర్పాటు చేసిన మెడికల్‌ క్యాంపులకూ ఒక్కరుకూడా రాలేదు. దీంతో ప్రజలు, అధికారులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -