end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంగ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యం
- Advertisment -

గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ విజయం తథ్యం

- Advertisment -
- Advertisment -

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం లాంఛనమేనని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. కూకట్‌పల్లి 121 డివిజన్ పార్టీ అభ్యర్థి జూపల్లి సత్యనారాయణకు మద్దతు తెలుపుతూ దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ఆ ధ్వర్యంలో కాలనీలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి డివిజన్ టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్అభ్యర్థి జూపల్లి సత్యనారాయణ రావులు హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు మిషన్ భగీరథ, రైతుబందు, కళ్యాణలక్ష్మీ లాంటి కార్యక్రమాలు చేపట్టి దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలిపిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. జూపల్లి మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చగలిగే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్, టీఆర్ఎస్‌ పార్టీ డివిజన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, అమ్రేష్ గౌడ్, వార్డ్ సభ్యులు ఎల్లం నాయుడు, డివిజన్ ఇన్ఛార్జ్ రామ్మోహన్, రామ్ చందర్, గడ్డం కృష్ణ, ఆవుల రాజు, నాగన్న, మోహన్ రావు సుద్దపల్లి సుధాకర్, జి ఎస్ ఆంజనేయులు, వెంకటేశ్వర శెట్టి, సుహాస్, బాలు, కొండలరావు, టిఆర్ఎస్ నాయకులు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -