హైదరాబాద్(Hyderabad) లోని రెండు వేరు వేరు హోటళ్లలో వ్యభిచారం జరుగుతోందని ఖచ్చితమైన సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయా హోటల్స్ పై నిఘా పెట్టి రైడింగ్ చేసి ఆ ఇద్దరు హీరోయిన్స్‌ని అరెస్ట్ చేసారు. ఈ సంఘటన శనివారం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్ (Taj Deccan)హోటల్లో వ్యభిచారం జరుగుతుందనే తెలుసుకొని హోటల్ పై దాడులు జరిపిన సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ముంబైకి చెందిన రిచా అనే నటిని, ఆమెతోపాటు ఆమెకి, విటులకి మధ్య బ్రోకర్‌గా పనిచేస్తోన్న మోనిష్ కడాకియాను కస్టడిలోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులకి అప్పగించారు.
తాజ్ బంజారా(Taj Banjara) హోటల్లో కూడా వ్యభిచారం(prostitution) జరుగుతుందని తెలుసుకొని హోటల్ పై దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.రూమ్ నెంబర్ 402 నుంచి బెంగాలీ టీవీ నటి సుబ్ర చటర్జీ, విటుడు వెంకటేశ్వర రావుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకి సంబంధించిన బ్రోకర్ జనార్థన్ పరారీలో వున్నట్టు పోలీసులు మీడియా(Media)కు వెల్లడించారు. ప్రస్తుతం కేసు ప్రాథమిక దర్యాప్తులో వుందని, కేసు విచారణ జరిపిన తర్వాత వివరాలు వెల్లడించడం జరుగుతుందనిపంజాగుట్ట(Panjagutta) సీఐ రవీందర్ రావు తెలిపారు.