Cardamom: యాలుకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అనేక రకాల ఆరోగ్య సమస్యల(Health issues)ను అధిగమించడానికి కూడా సహాయపడుతుంది.తెలుగువారు ఎన్నో రకాల రెసిపీస్ లో యాలుకలని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా తీపి పదార్థాల(Sweet Items)ను తయారు చేసుకోవడానికి యాలుకలు ఎక్కువగా వాడతాం. ప్రపంచంలో ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యాలకుల స్థానం మూడవది. యాలుకలు ఆకు పచ్చ రంగు, నలుపు రంగు రకాలు ఉంటాయి. ఎక్కువగా మనం ఆకు పచ్చ యాలకలు వాడుతాం. ఇవి మలేషియా(Malaysia)లో ఎక్కువగా పండిస్తారు.
(స్పీడ్ గా సన్నాగ అవ్వాలంటే..)
ప్రతిరోజూ రెండు యాలకుల(Cardamom)ను పరగడుపున లేదా రాత్రి సమయంలో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మనకు మందులను వాడే అవసరమే లేదని నిపుణులు(Experts) చెబుతున్నారు. ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఒకటైన అధిక బరువు(Heavy Weight) సమస్య నుండి మనం చాలా సులభంగా ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బయటికి పంపిస్తాయి. అదేవిధంగా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణంకాక అజీర్తి, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
(యాలకులతో శృంగార సమస్యలకు చెక్)
యాలుకలు తీసుకోవడం వల్ల కడుపులో మంట, నొప్పి వంటివి తగ్గి పోతాయి. సంతాన సాఫల్యత(Fertility Achievement)ను పెంచడంలో యాలకులు బాగా సహాయం చేస్తాయి. పురుషుల్లో నరాల పటిష్టత(Nerve Stiffness)కు యాలకులు ఎంతగానో ఉపయోగపడతాయి.రాత్రి పూట యాలకులను తిని గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల మానసిక ప్రశాంతత కలగడంతోపాటు చక్కటి నిద్రను సొంతం చేసుకోవచ్చు. మూత్రాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉదయం పూట యాలకులను తీసుకోవడం వల్ల మూత్ర పిండాల్లో రాళ్లు, మూత్రంలో మంట, ఇన్ ఫెక్షన్స్(Infections) వంటి తదితర సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. రక్తహీనత సమస్యను తొలగించే పోషకాలు యాలకుల్లో అధికంగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఈ విధంగా యాలకులను తీసుకోవడం వల్ల సమస్య ఉండి త్వరగా బయటపడవచ్చు.
బ్లడ్ ప్రెషర్(Blood Pressure) ఎక్కువ తక్కువ కాకుండా యాలుకలు హెల్ప్ చేస్తాయి. అలానే కాన్సర్(Cancer) సమస్య రాకుండా కూడా యాలుకలు చూసుకుంటాయి. యాలుకలలో క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయి. టెన్షన్ ఎక్కువగా ఉన్నా సరే యాలుకలు తీసుకుంటే మంచిది. దీంతో ఒత్తిడి బాగా తగ్గుతుంది.హార్ట్(Heart Problems) ఫెయిల్యూర్ వంటి సమస్యలను కూడా తొలగిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా యాలుకలు బాగా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తాయి.