భారతదేశంలో ఫ్రెండ్షిప్ డే ని ఆగస్టు మొదటి ఆదివారం జరుపుకోవడం కొనసాగుతుంది. మీ బంధాన్ని గౌరవించడం కోసం మీరు మీ మంచి స్నేహితులతో కలిసి రోజు జరుపుకోవడం ఆనందించవచ్చు. మీరు ఎవరితోనైనా కలిగి ఉండగల ఉత్తమ సంబంధాలలో స్నేహం ఒకటి. షరతులు లేని ప్రేమ ఆలోచన ఆధారంగా, స్నేహం యొక్క బంధానికి కులం, మతం, రంగు, వయస్సు, మతం మరియు జాతికి సంబంధించిన సరిహద్దులు ఏమి ఉండవు. మీకు ఏడవడానికి భుజం అవసరం అయినప్పుడు మీకు సహాయం చేయడానికి స్నేహితులు ఎల్లప్పుడూ ఉంటారు. వారు మీ కోసం పోరాడుతారు, మీకు మద్దతు ఇస్తారు మరియు సరైన మార్గంలో నడవడానికి తరచుగా మీకు మార్గనిర్దేశం చేస్తారు. స్నేహం యొక్క బంధాన్ని మన కోసం అందంగా మార్చే వారందరి జీవితాలలో ఆనందాన్ని పంచడానికి స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు.
చిన్నవారైనా, పెద్దవారైనా, స్నేహాలనేవి ఆరోగ్యం, శ్రేయస్సు వంటి మార్పులను పెంపొందిస్తాయి. మన స్నేహితులు మన మంచి గురించే మాట్లాడతారు. జీవితాంతం తోడుగా ఉండే స్నేహాలను చేయండి. ఆ మాధూర్యాన్ని మీరూ ఆస్వాదించండి. మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు ఫ్రెండ్షిప్ కీ రోల్ పోషిస్తుంది. మనల్ని హ్యాపీగా ఉండేందుకు మన ఎదుగుదలకు అన్నింటికి కూడా ఫ్రెండ్షిప్ హెల్ప్ చేస్తుంది.
రాబర్ట్ w. మోలర్ చేసిన అధ్యయనం ప్రకారం ఓ మంచి స్నేహం అనేది చక్కని సంబంధం కలిగి ఉంటుంది. అది వారి మానసిక ఆరోగ్యంపై చక్కని ప్రభావం చూపిస్తుందని తేలింది. వ్యక్తులతో స్నేహం, బంధాలను ఏర్పరుచుకోవడం అనేది మన జీవితాల్లో మనమందరం ఆదరించే నిజమైన ఆనందం. అందరం కూడా స్నేహం చిగురించే దశ నుండి అనుభవించడం, అభిప్రాయ భేదాలతో వ్యవహరించడం, సర్దుబాట్లు, ఎదగడం, కోపాలు ఇలాంటి వాటన్నింటిని అనుభవిస్తూ పెరిగాం. మనకు ఇబ్బంది కలిగించే విషయాల గురించి స్నేహితులతో మాట్లాడడం వల్ల ఆ బాధ కాస్తా తగ్గుతుంది.
వారు మనకి ఏదైనా సొల్యూషన్ ఇచ్చినప్పుడు, సహాయం చేయాలనుకున్నప్పుడు మనికి ఉపశమనంగా ఉంటుంది. సన్నిహిత స్నేహాలు మన భావోద్వేగాలను బ్యాలెన్స్ చేస్తాయి. మనకి కావాల్సిన వ్యక్తుల ఫ్రెండ్షిప్ పొందడం చాలా మంచిది. ఫోర్బ్స్ పరిశోధన ప్రకారం, సామాజిక సంబంధాలు, సానుకూల స్నేహితులతో కలవని వ్యక్తులే ఒంటరిగా ఉంటారు. మీకు మంచి స్నేహితులు ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా చేయడం, మాట్లాడడం, చూడడం వంటివి జరుగుతాయి. అదే ఒంటరిగా ఉన్నప్పుడు పరధ్యానంలో ఉంటాం. అందుకే మంచి మిత్రులు ఉండటం చాలా ముఖ్యం.