end
=
Wednesday, November 20, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంThippa Teega: తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు….
- Advertisment -

Thippa Teega: తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు….

- Advertisment -
- Advertisment -

Thippa Teega: తిప్పతీగ‌(Giloy).. సిటీల‌లో ఉండేవాళ్లకు దీని గురించి తెలియ‌క‌పోయినా ప‌ల్లె జనాల‌కు మాత్రం నిత్యం క‌నిపించేదే. ఇది గ్రామాల్లో ఇంటి పరిసరాల్లోనే పెరుగుతుంది.రోగ నిరోధక శక్తిని(Immunity Power) పెంచేందుకు ఈ తీగ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని పెద్దలు చెబుతారు.దీన్ని ఇంగ్లిష్‌లో గిలోయ్ అని, సంస్కృతంలో అమృత అని పిలుస్తారు. సీజన్‌లో వచ్చే జ్వరాలు, వ్యాధులు, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.

సాధారణంగా తిప్పతీగను ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఆయుర్వేద గుణాలు ఉండే తిప్పతీగలో ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద (Ayurveda Medicine) మందుల్లో తిప్పతీగని ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిజంగా ఎన్నో రకాల సమస్యలు తగ్గుతాయి. తిప్పతీగలో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. స్టెరాయిడ్స్ మరియు కార్బోహైడ్రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తిప్పతీగ వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తిప్పతీగ వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తరిమికొట్టొచ్చు. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మరి ఇక వాటి కోసం చూస్తే ఒకటి కాదు రెండు కాదు తిప్పతీగ వల్ల చాలా ప్రయోజనాలు మనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

(Fenugreek: మెంతులతో ఎన్నో ప్రయోజనాలు)

ఎన్నో ఏళ్ల నుంచి ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించే తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో కూడా ఫైట్ చేయగలవు.శరీరంలోని కణాలు దెబ్బ తినకుండా ఉండడానికి ఎంతో బాగా తిప్పతీగ సహాయం చేస్తుంది. అలానే ఎన్నో అనారోగ్య సమస్యలు తరిమికొట్టడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. సీజనల్ వ్యాధులు(Seasional Dieses), విష జ్వరాలు(Flu) అయిన డెంగ్యూ(Dengew), మలేరియా(Malaria) వంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. అలానే తిప్పతీగ వల్ల ఒత్తిడి(Mental Stress), ఆందోళన(Anxiety) వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. చాలా మంది మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటారు. అటువంటి వాళ్ళు తిప్పతీగ తీసుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అదే విధంగా ఆందోళన కూడా తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి కూడా తిప్పతీగ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా తిప్పతీగ ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

(Curry leaf: ‘కరివేపాకు’తో అందం, ఆరోగ్యం..!)

అంతే కాదండి జీర్ణ వ్యవస్థను(Improves Digesion System) మెరుగు పరచడంలో కూడా తిప్పతీగ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అజీర్తి సమస్యతో బాధ పడేవారు తిప్పతీగ తో తయారు చేసిన మందులు ఉపయోగిస్తే మంచిది. మధుమేహానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే టైప్ 2 డయాబెటిస్ ని(Type 2 Diabeties) ఇది త్వరగా పోగొడుతుంది. రక్తంలో చక్కెర (Blood Glucose Levels) స్థాయిలని కూడా తగ్గిస్తుంది. తిప్పతీగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారికి మంచిగా ఉపశమనం లభిస్తుంది.

ది ఇలా ఉండగా ఆర్థరైటిస్‌తో బాధపడే వాళ్లకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. కీళ్ళ వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. కంటి చూపును మెరుగు పరచడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగ పడుతుంది. వృద్ధాప్య ఛాయలు రాకుండా కూడా ఇది చూసుకుంటుంది. ఇలా చాలా ప్రయోజనాలు మనం తిప్పతీగతో పొందొచ్చు. రక్తాన్ని ప్యూరిఫై చేయడానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ని తొలగిస్తుంది మరియు లివర్ సమస్యలని కూడా తొలగిస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ని కూడా తొలగించడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండే తిప్పతీగ లో జ్ఞాపక శక్తిని మెరుగు పరిచే గుణాలు, ఒత్తిడిని తగ్గించే గుణాలు ఉంటాయి.బౌల్ రిలేటెడ్ సమస్యలని కూడా ఇది తొలగిస్తుంది. డార్క్ స్పాట్స్, పింపుల్స్ వంటి వాటిని కూడా ఇది పోగొడుతుంది. ఇలా ఇన్ని మంచి గుణాలు ఉండే తిప్పతీగ లో తిప్పతీగ తో ఎన్నో అనారోగ్య సమస్యలను మనం తగ్గించుకోవచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -