end

ఓటరు కార్డు లేకపోతే ఇవి ప్రత్యామ్నయం

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రేపే జరగనున్నాయి. ఓటర్లు ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు ఓటర్‌ ఐడీ కార్డు కూడా తప్పకుండా తేవాలని ఎలక్షన్‌ కమిషన్‌ ఇప్పటికే సూచించింది. ఓటర్‌ ఐడీ కార్డు లేకపోతే ప్రత్యామ్నయంగా 18 గుర్తింపు కార్డులను ఎన్నికల సంఘం సూచించింది. వీటిలో ఏ ఒక్క కార్డును తీసుకెళ్లినా.. ఓటేయవచ్చు.

గుర్తింపు కార్డులివే.. ఆధార్‌, పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, సర్వీస్‌ ఐడెంటిఫై కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాన్‌ కార్డు, ఆర్జీఐ, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డ్‌, జాబ్‌ కార్డు, హెల్త్‌ కార్డు, ఫించన్‌ డాక్యుమెంట్‌, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, రేషన్‌ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఫ్రీడం ఫైటర్‌ ఐడెంటిఫై కార్డ్‌, ఆర్మ్స్‌ లైసెన్స్‌ కార్డ్‌, అంగవైకల్యం సెర్టిఫికేట్‌, లోక్‌ సభ, రాజ్యసభ ఐడెంటిఫై కార్డు, పట్టాదారు పాసుబుక్‌.

Exit mobile version