దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా.. భారత ప్రభుత్వం అజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో భారీ ఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కూడా చేస్తుంది . మువ్వన్నెల జెండా రెపరెపలతో జాతీయ పండుగను ఘనంగా జరపాలని ప్రణాళిక రూపొందించింది. దీనికి ముందు త్రివర్ణ పతాకాన్ని అవమానించకుండా ఉండాలంటే దానికి సంబంధించిన అన్ని నియమ, నిబంధనలు, చట్టాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. జాతీయ జెండాను అత్యంత గౌరవప్రదంగా చూసుకోవాలి.
- జెండాపై ఏదైనా రాయడం, సృష్టించడం, తొలగించడం చట్టవిరుద్ధం.
- త్రివర్ణ పతాకాన్ని వాహనం వెనుక, విమానంలో లేదా ఓడలో పెట్టకూడదు.
- త్రివర్ణ పతాకాన్ని ఏ వస్తువులు లేదా భవనాలను కప్పడానికి ఉపయోగించరాదు.
- ఎట్టి పరిస్థితుల్లోనూ త్రివర్ణ పతాకం నేలను తాకకూడదు.
- త్రివర్ణ పతాకాన్ని ఏ విధమైన అలంకరణ కోసం ఉపయోగించరాదు.
- జాతీయ జెండా కంటే మరే ఇతర జెండా హైట్‌లో ఉంచకూడదు.