- టీఆర్ఎస్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమికొడతారని ఆగ్రహం
తెలంగాణలో టీఆర్‌ఎస్ (TRS) నేతలు ఫ్రస్టేషన్‌తోనే (Frustration) దాడులకు తెగబడుతున్నారని బీజేసీ చీఫ్ బండి సంజయ్ (Bandi sanjay) ఆరోపించాడు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అధికారం నుంచి తరమికొడతారనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డాడు. ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ (Nizamabad MP Dharmapuri Arvind) నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ మేరకు శనివారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను (Family members) పరామర్శించారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ గుండాల (TRS rowdi)దాడులను ఖండిస్తున్నామన్నారు. దాడులు చేయాల్సిన అవసరం ఏముందన్నారు. అరవింద్ బూతులేమీ మాట్లాడలేదని, వాస్తవాలను ప్రజల ముందుంచారని తెలిపారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని అడిగారు. అరవింద్ అమ్మానాన్నలు పెద్దవాళ్ళని, నాన్న అనారోగ్యంతో బాధపడుతున్నారని, మంచానికే పరిమితమయ్యారన్నారు. అద్రుష్టవశాత్తు ఆయన దాడి సమయంలో ఇంట్లో లేరని, ఒకవేళ ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు బండి సంజయ్. ఎంపీ అరవింద్ నివాసంలో ఉన్న మహిళలపై టీఆర్ఎస్ గూండాలు రాళ్లు విసరడం అందరూ చూశారని, మహిళల గురించి మాట్లాడే టీఆర్ఎస్ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు.
(Etela Rajender:మాజీ నక్సలైట్లతో దాడులు చేయిస్తున్నారు)
అలాగే కేసీఆర్ కుటుంబానికి అహంకారం ఎక్కువైందని, బీజేపీ (BJP) చేతిలో ఓటమి ఖాయమనే క్రోమా ఫోబియా (Chroma phobia) పట్టుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడులు, ప్రెస్ మీట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు ఏదో డ్రామా (Draama) చేద్దామనుకున్నారని, జనం నమ్మలేదని, డామిట్ కథ అడ్డం తిరిగిందన్నట్లుగా పరిస్థితి తయారైందని బండి సంజయ్ విమర్శించారు. ధర్మపురి అరవింద్ మాట్లాడితే.. వాళ్ల కుటుంబ సభ్యులపై, నివాసంపై దాడి చేయడమేంటని, వాళ్లకు ఏం సంబందమని ప్రశ్నించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయణదానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అడిగారు. పైగా ఊరికించి కొడతామని అంటున్నరు. రాష్ట్ర ప్రజలే టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్ కుటుంబాన్ని (KCR family)ఉరికించి ఉరికించి తెలంగాణ పొలిమేరలు దాటించి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
అరవింద్ నివాసంపై దాడి ఘటనకు పోలీసులే (Police) బాధ్యులని, బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కొందరు పోలీసులు పింక్ డ్రెస్ (pink dress) వేసుకుని టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా పని చేస్తున్నారని, ఇది క్షమించరాని విషయమన్నారు. టీఆర్ఎస్ నేతల్లో ఫ్రస్టేషన్ ఎక్కవైందని, కేసీఆర్ కుటుంబంలో అంత:పుర కలహాలు స్టార్ట్ అయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా, కుటుంబ పెద్దగా, తండ్రిగా ఫెయిల్ (fail) అయ్యారని, ప్రజల ద్రుష్టి మళ్లించేందుకే దాడులతో డ్రామాలు చేస్తున్నారన్నారు.
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనను తాను, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకె.అరుణ (DK Aruna is the National Vice President of the party) కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah)దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమిత్ షా అరవింద్‌తో ఫోన్ (Phone)లో మాట్లాడి భరోసా ఇచ్చారని తెలిపారు. బీజేపీలో చేరాలంటూ ఫోన్ చేశారంటూ కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కేసీఆర్‌నే (KCR) పట్టించుకోలేదు.. ఆయన కుమార్తెను ఎవరు పట్టించుకుంటారని అన్నారు. నలుగురు ఎమ్మెల్యేల (MLA) కొనుగోలు వ్యవహారంలో నోటీసులపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తమకు నోటీసులు (Notice) కొత్తకాదని, నోటీసులొస్తే వాళ్లలెక్క పట్టీలు వేసుకోబోమన్నారు. వీల్ చైర్ (wheel chair) లో కూర్చోబోమని, బరాబర్ తీసుకుంటామన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదని, డబుల్ బెడ్రూం ఇళ్లు, రుణమాఫీ సహా ఏ సమస్యలపై సీఏం స్పందించడంలేదంటూ పలు అంశాలను లేవనెత్తుతూ మండిపడ్డారు.
(Alcohol:ఆల్కహాల్‌తో స్టీమీ సెక్స్ సెషన్ నిజమేనా?)
ఇదిలావుంటే… తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR)పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijaya shanthi). కేసీఆర్ (kcr) పది తలల రావణాసురుడు అంటూ ధ్వజమెత్తారు. సీఎంగా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఏ రోజూ మంచి చేయలేదన్నారు. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడిని ఖండించారు. విమర్శిస్తే కొట్టి చంపుతామని అనడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీధిరౌడీలకు మీ బిడ్డలు మాట్లాడిన దానికి తేడా ఏంటి? అని ప్రశ్నించారు. కవిత పార్టీ మార్పుపై మొదట మాట్లాడింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం నోరు, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలంటా ఆగ్రహం వ్యక్తం చేసింది.