end
=
Thursday, November 21, 2024
వార్తలురాష్ట్రీయంఆన్‌లైన్ లోన్ యాప్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు…
- Advertisment -

ఆన్‌లైన్ లోన్ యాప్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు…

- Advertisment -
- Advertisment -

తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్‌ల వేధింపులు ఆగడం లేదు. మనిషి చనిపోయినా సరే ఆగని రుణ యాప్‌ల వేధింపులు. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలోనే అగ్నిమాపక శాఖలో పనిచేస్తున్న సుధాకర్ అనే కానిస్టేబుల్ వారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్‌ యాప్‌లో రూ.6వేల రుణం తీసుకున్న పాపానికి అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ నగర శివారు రంగారెడ్డి జిల్లాజల్‌పల్లిలో చోటుచేసుకుంది. తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదనే నెపంతో నీ భార్య ఫోన్‌ నెంబర్‌ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు రూ.1000 సంపాదించొచ్చంటూ యాప్‌ నిర్వాహకులు వేధించడంతో అవమానభారంతో రైలు కింద పడి అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగారెడ్డి జిల్లా జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్‌(33) చందులాల్‌ బారదరి ఫైర్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య మాధవి ఓ కూతురు(18 నెలలు) ఉన్నారు. సుధాకర్ ఇటీవల ఆర్థిక అవసరాల నిమిత్తం గోల్డెన్ రూపీ అనే యాప్ నుంచి రూ.6వేలు అప్పుగా తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకలేకపోవడంతో యాప్ నిర్వాహకులు రోజూ ఫోన్ చేసి వేధింపులకు గురిచేసేవారు. దీంతో సుధాకర్ స్నేహితుల సాయంతో లోన్ కట్టేసినా ఇంకా బకాయి ఉందంటూ వారు వేధించేవారు. అసభ్య పదజాలంతో తిట్టడంతో పాటు వాట్సాప్‌కు మెసేజ్‌లు, అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫోటోలు పంపించేవారు. నీ భార్యతో వ్యభిచారం చేయించి అప్పు తీర్చాలంటూ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో పాటు సుధాకర్ మోసగాడంటూ అతని కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. ఇలా ఇష్టం వచ్చినట్టు తిడుతూ బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన సుధాకర్ తన కష్టాన్ని సన్నిహితుల వల్ల చెప్పుకుని బాధపడ్డాడు.

ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 6 గంటలకు డ్యూటీకి బయలుదేరినసుధాకర్‌ 6:12 నిమిషాలకు అన్న కుమార్‌కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. దీంతో ఆయన ఎన్నిసార్లు తిరిగి కాల్ చేసినా ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. శివరాంపల్లి – శాస్త్రీపురం మార్గంలో శంషాబాద్ నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న రైలు కింద పడి సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కాచిగూడ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆన్‌లైన్ లోన్ యాప్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -