end
=
Friday, March 14, 2025
సినీమాNikeet Dhillon:బతికుండానే చనిపోయానని ప్రచారం చేశారు
- Advertisment -

Nikeet Dhillon:బతికుండానే చనిపోయానని ప్రచారం చేశారు

- Advertisment -
- Advertisment -


పంజాబీ నటి నికీత్ ధిల్లాన్ సోషల్ మీడియా(Social Media)లో తాను మరణించినట్లు వచ్చిన పుకార్లపై స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా వీడియో పోస్ట్ చేసిన నటి.. తన ఫేస్ బుక్(Facebook) ఖాతా హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపింది. అయితే ఇందులో తాను చనిపోయినట్లు హ్యాకర్స్ క్రియేట్ చేయడంతో కుటుంబం మొత్తం మానసికంగా కుంగిపోయినట్లు పేర్కొంది. అలాగే అమ్మ అమ్మమ్మ వాళ్లు సోషల్ మీడియాను యూజ్ చేయరన్న నికీత్.. ఎవరో ఫోన్ చేసి తన మరణం గురించి చెప్పడంతో దారుణంగా ఏడ్చారని, ఏమి జరిగిందో వివరించడానికి తోబుట్టువులు ప్రయత్నించినప్పటికీ వాళ్లను ఓదార్చలేకపోయారని వెల్లడించింది.

అంతేకాదు మరుసటి రోజు కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తూనే ఉన్నారన్న ధిల్లాన్ ‘ఇది పబ్లిసిటీ స్టంట్‌గా చాలామంది భావించి ఉంటారు. కానీ, నా కుటుంబ ఎలా షాక్‌(Shock)కు గురయ్యారో నాకు మాత్రమే తెలుసు. మొహాలీలోని సైబర్ సెల్‌కి వెళ్లి కంప్లైట్ చేసినా నా మాట వినడానికి ఆసక్తి చూపలేదు. మీ ఖాతాలో విలువైనవి ఉన్నాయ అని అడిగితే లేవని చెప్పాను. దీంతో మీరెందుకు పట్టించుకుంటున్నారు వదిలేయండి అన్నారు’ అని గుర్తు చేసింది. చివరగ హ్యాకర్(Hacker) తన నుంచి కొంత మొత్తాన్ని డిమాండ్ చేశాడని, తనను పెళ్లి కూడా చేసుకోవాలని కోరుతూ వీడియో కాల్(Video call) చేశాడని వివరించింది.

(The Kashmir Files:‘ది కశ్మీర్ ఫైల్స్’ అసభ్యకర చిత్రమే)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -