బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్(Anurag Kashyap) తన జీవితంలో చాలా తక్కువ సమయం డిప్రెషన్‌తో పోరాడినట్లు తెలిపాడు. అయితే ఎంత ఒత్తిడిలో ఉన్నా తన పనిని మాత్రం ఆపలేదని తాజా ఇంటర్వూలో చెప్పాడు. అలాగే కొన్ని ప్రతికూలత కారణంగా 2019లో కొంతకాలం ట్విట్టర్(Twitter)కు దూరంగా ఉన్నానన్న ఆయన కూతురు అలియా కశ్యప్(Aliya Kashyap)ను ట్రోల్ చేస్తూ రేప్(Rape) చేస్తామని బెదిరింపుల రావడం ఆందోళన కలిగించిందన్నాడు.‘ప్రభుత్వాలు మారుతున్నా.. రాజ్యాంగ సవరణలు జరుతున్నా.. పోలీసుల(police) వ్యవస్థ పటిష్టిమవుతున్నా.. న్యాయ వ్యవస్థ(Legal System) నిత్య నూతనంగా ఆలోచిస్తున్నా.. అబలపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. అది మాటల రూపంలోనైనా, చేతల రూపంలోనేనా. వారికి సంబంధం ఉన్న విషయంలోనైనా, సంబంధం లేని విషయంలోనైనా. వారిని టార్గెట్(Target) చేస్తున్న తీరు అసలు మారడమే లేదు. దేశంలో ఎంతోమంది అబలలు ఎన్నో రకాలుగా అవమానపడుతున్న వేళ.. అఘాయిత్యాలకు లోనవుతున్నా వేళ.. దాడులకు గురవుతున్న వేళ..నా కూతిరినే రేప్ చేసి చంపేస్తామంటూ కొందరు బెదరించారు’ అంటూ ఎమోషనల్(Emotional) అయ్యాడు. అంతేకాదు ఈ ఇష్యూవల్ల తనకు గతేడాది తనకు గుండెపోటు వచ్చిందన్న అనురాగ్.. దీనిపై ఎవరూ బలంగా మాట్లాడకపోవడాన్ని భరించలేకపోయానని, అందుకే తాను ముక్కుసూటిగా మాట్లాడటం ప్రారంభించినట్లు వెల్లడించాడు.
(Kajol:30 ఏళ్ల తర్వాత కలిసి నటించిన జోడి)