21 రోజుల పాటు కొనసాగనున్నా కాణిపాకం బ్రహ్మోత్సవాలు..
కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి వారు రోజుకో వాహనంపై ఊరేగుతున్నాడు. శుక్రవారం వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన మూషిక వాహనంపై తిరువీధుల్లో విహరించారు. వినాయక చవితినాడు ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 21రోజుల పాటు సెప్టెంబర్ 11 వరకు కొనసాగనున్నాయి.

