కాస్మోటిక్స్ దిగ్గజం రెవ్లాన్ దివాలా అంచుల్లోకి చేరుకుంది. మార్కెట్లో పోటీని తట్టుకోలేక, డిమాండ్ అందుకోలేక అయోమయం లో.. ఏకంగా చేతుల్లో ఎత్తేస్తోంది. వచ్చే వారంలోనే ప్రముఖ అమెరికన్ బ్యూటీ కంపెనీ రెవ్లాన్ దివాలా తీయనున్నట్టు రాయిటర్స్ పెర్కున్నారు. ఈ వార్తలతో ఒక్కసారిగా రెవ్లాన్ షేర్లు కుప్పకూలాయి. ఒక్కరోజే ఏకంగా 53 శాతం మేరకు రెవ్లాన్ షేర్లు పతనమయ్యాయి. ప్రముఖ కాస్మోటిక్స్ కంపెనీలలో ఒకటైన రెవ్లాన్ దివాలాకి దగ్గర్లో ఉంది. దివాలా అంచుల్లోకి ఈ బ్యూటీ కంపెనీ వచ్చినట్టు తెలిసింది. వచ్చే వారంలోనే కంపెనీ దివాలా అప్లికేషన్ దాఖలు చేయనుందని తెలిసింది. దీంతో రెవ్లాన్ కంపెనీ షేర్లు అమెరికా మార్కెట్లో శుక్రవారం ట్రేడింగ్‌లో భారీగా పతనమయ్యాయి. ఏకంగా ఒక్క రోజే 53 శాతం మేరకు రెవ్లాన్ షేర్లు కుప్పకూలాయి. తన వ్యాపారాలను కాపాడుకునేందుకు రుణదాతలతో కంపెనీ చర్చలు జరుపుతోంది. రాయిటర్స్ రిపోర్టు ప్రకారం, మార్చి నాటికి కంపెనీ అప్పులు 3.31 బిలియన్ డాలర్లకు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.25,865 కోట్లకు పెరిగినట్టు తెలిసింది. కరోనా లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మేకప్ ప్రొడక్టులకు డిమాండ్ చాలా బాగా పెరిగింది. కానీ ఇతర బ్రాండ్ల నుంచి వస్తోన్న గట్టి పోటీని రెవ్లాన్ తట్టుకోలేకపోతుంది. ముఖ్యంగా డిజిటల్ బ్రాండ్ల పోటీని ఈ కంపెనీ తట్టుకోలేకపోతుంది. అంతేకాక కంపెనీ తమ కాస్మోటిక్స్ ప్రొడక్టులకు వచ్చే డిమాండ్‌ను కూడా అందుకోలేక సతమతమవుతుంది. రెవ్లాన్ దివాలా పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుందనే విషయాన్ని తొలిసారి రీఆర్గ్ రీసెర్చ్ రిపోర్టు చేసింది.
అయితే రెవ్లాన్ దివాలా అప్లికేషన్‌పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. ఈ వార్తలు వెలువడిన కొద్ది సేపట్లోనే కంపెనీ షేర్లు 53 శాతం వరకు పడిపోయాయి. కంపెనీ స్టాక్ గ్లోబల్ మార్కెట్లో 2.05 డాలర్ల వద్ద ముగిసింది. రెవ్లాన్ కంపెనీ 50 రకాల బ్రాండ్లను విక్రయిస్తోంది. రెవ్లాన్ వ్యాపారాలు 150కి పైగా దేశాలలో ఉన్నాయి. 90 ఏళ్ల క్రితం ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. రెవ్లాన్ ఓనర్ మ్యాక్‌ఆండ్రూస్ అండ్ ఫోర్బ్స్. కరోనాకి ముందు కూడా కంపెనీ అమ్మకాలు అంతంతమాత్రమే ఉన్నాయి.