end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంరాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలి
- Advertisment -

రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలి

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచి విజయం సొంతం చేసుకుందనుకోవచ్చు. ఓల్డ్‌ సిటీలో దాదాపు ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసిందనుకోండి. కాగా, ఆదివారం హాఫీజ్‌ బాబానగర్‌లోని ఫలక్‌ ప్యాలెస్‌ పంక్షన్‌హాల్‌లో నూతన కార్పొరేటర్లు, మజ్లిస్‌ పార్టీ కార్యకర్తలతో విజయోత్సవ సభ నిర్వహించారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో గెలుపొందిన కార్పొరేటర్లను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా చంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ.. మజ్లిస్‌ పార్టీ కార్పొరేటర్లు పదవులను అడ్డుపెట్టుకుని ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం, వేధింపులకు గురిచేసినట్లు తెలిస్తే వారి కాలర్‌ పట్టి నడిబజారులో నిలబెడతానని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ హెచ్చరించారు.

సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు ‘పదవులను ప్రజా సేవ కోసం దేవుడిచ్చిన అవకాశంగా భావించాలని, పదవులను అడ్డుపెట్టుకుని వసూళ్లకు పాల్పడినట్లు తెలిస్తే సహించేది లేదన్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని ప్రజలను వేధించొద్దని’ చెప్పారు. చాంద్రాయణగుట్ట ప్రాంతం నా రక్తం చిందించిన నేల అన్నారు, ఈ ప్రాంతం అంటే నాకెంతో మక్కువ, నా ప్రాణం, నా శ్వాస ఉన్నంతవరకు వారికి ఎవరైనా చెడు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -