end
=
Sunday, January 19, 2025
సినీమాJennifer lopez:‘దిస్ ఈజ్ మీ.. నౌ’ ఒక ఎమోషనల్ జర్నీ
- Advertisment -

Jennifer lopez:‘దిస్ ఈజ్ మీ.. నౌ’ ఒక ఎమోషనల్ జర్నీ

- Advertisment -
- Advertisment -


హాలీవుడ్ స్టార్ సింగర్, నటి జెన్నిఫర్ లోపెజ్ తన అభిమానులకు బిగ్ గుడ్ న్యూస్(Good news) చెప్పింది. గత ఎనిమిదేళ్లుగా తనకు సంబంధించిన సొంత అల్బమ్(Albam) ఒక్కటికూడా రిలీజ్ చేయని గాయని తాజాగా నయా మ్యూజిక్ ప్రాజెక్ట్‌ రూపొందించపోతున్నట్లు అఫిషియల్‌(Official)గా అనౌన్స్ చేసింది. అంతేకాదు ‘దిస్ ఈజ్ మీ… నౌ(This is me now)’ అనే పేరుతో తీసుకొస్తున్న అల్బమ్‌ను 2023లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.

అయితే ఈ ప్రాజెక్ట్ గత 20ఏళ్లుగా తన ఎదుర్కొన్న భావోద్వేగ, ఆధ్యాత్మిక(Spiritual), మానసిక ప్రయాణాన్ని వివరిస్తుందన్న ఆమె.. ‘ఎమోషనల్ ఫీలింగ్స్‌(Emotional Feelings)తో ముడిపడిన నిజాయితీగల ప్రాజెక్ట్. ఇంతకు ముందు రూపొందించిన దానిలా కాకుండా నా జీవితం, అనుభవాల గురించి రాసి పాడుతున్నా. మనందరికీ ప్రతిధ్వనిస్తుంది. నా కష్టతరమైన బాల్యం, విజయవంతం కాని సంబంధాలు, ఆశ, విశ్వాసం, నిజమైన ప్రేమ ఎప్పటికీ చావదనే చాటిచెబుతుంది. ఈ స్వీయచరిత్ర కథలు ఇతర వ్యక్తిగత ప్రాజెక్టులకు దారితీస్తాయని నమ్ముతున్నా. వచ్చే ఏడాది విడుదల అవుతుంది’ అంటూ క్లారిటీ ఇచ్చింది. చివరగా తాను ఇటీవల చేసిన అత్యంత నిజాయితీగల పని ఇదేనన్న ఆమె.. ‘ది వాల్(The Vaal)’ తరహాలోనే ఈ ఆల్బమ్‌ ప్రేమతో ప్రపంచం దృష్టి ఆకర్షించాలనేది ఆశ అని చెప్పింది.

(Ekta Kapoor:స్త్రీల టాలెంట్ చూపేందుకే బోల్డ్ కంటెంట్ తీస్తున్నా)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -