end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంChandrababu Naidu:ఇదే చివరి అవకాశం
- Advertisment -

Chandrababu Naidu:ఇదే చివరి అవకాశం

- Advertisment -
- Advertisment -

  • ప్రజలు ఇప్పుడైనా కళ్లు తెరవాలంటున్న చంద్రబాబు
  • వైసీపీ ప్రభుత్వం దిగిపోతేనే రాష్ట్రం బాగుపడుతుంది


టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) జగన్ (Jagan)ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి ఏపీ (AP)లో సీఎం (CM)గా చేశానని, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. తనకు ఎమ్మెల్యే (MLA)పదవితో పనిలేదని రాష్ట్ర ప్రజల్లో చైతన్యం రావాలని, అందుకు అంతా ధైర్యంగా ముందుకు రావాలని పేర్కొన్నారు. భయపడితే ఆ భయమే మనల్ని చంపేస్తుందంటూ చంద్రబాబు తెలిపారు. ఏలూరు (Aluru) జిల్లా దెందులూరు (Denduluru) నియోజకవర్గం విజయరాయిలో ఇదేం ఖర్మ పేరుతో చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ (YCP)ప్రభుత్వం దిగిపోతేనే ఏపీ రాష్ట్రం బాగుపడుతుందని పేర్కొన్నారు. ఒక్క ఛాన్స్‌ అంటూ జగన్‌ ప్రజల నెత్తి మీద భస్మాసుర హస్తం పెట్టారని విమర్శించారు. రాష్ట్రం అన్ని రకాలుగా దెబ్బతిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఎక్కడ చూసినా జనం ఇదేం ఖర్మ అనే పరిస్థితికి వచ్చిందన్నారు.

ఆనాడు తాను చెప్పిందే ఇవాళ జరుగుతోందన్న ఆయన.. రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఇప్పుడైనా తన మాట వింటారని ఆశిస్తున్నారని.. ఇప్పుడు కూడా వినకపోతే ఈ రాష్ట్రానికి ఇదే ఆఖరి అవకాశం అవుతుందంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ (TDP) ప్రభుత్వంలోనే పోలవరం ప్రాజెక్టు (Polavaram)ను 72 శాతం పూర్తి చేశామని.. జగన్ ప్రభుత్వం రివర్స్‌ టెండర్ (Reverse Tende)) పేరిట పోలవరాన్ని గోదావరిలో (Godavari)ముంచేసిందన్నారు. అలాగే వైఎస్‌ వివేకా హత్య కేసు విచారణను ఆయన కుమార్తె వైఎస్‌ సునీత (YS Sunitha)తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయించడం సీఎం జగన్‌కు చెంపదెబ్బ లాంటిదని చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని (Denduluru MLA Abbayya Chaudhary) లండన్‌ బాబు (London babu) అంటూ విమర్శలు చేశారు.

(Gujarat Election:గుజరాత్‌లో మొదలైన తొలి దశ ఫైట్)

ఇక ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. అనంతరం ఆయన ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జగన్‌రెడ్డి (CM Jagan)కి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని (vivekananda reddy) ఎవరు.. ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని.. బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మీటింగ్‌లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని.. ప్రజల్లో చైతన్యం రావాలని.. ధైర్యంగా ముందుకు రావాలని పిలుపిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులిస్తోందని, అయినా నాశనం చేశారని మండిపడ్డారు.

అలాగే బాబాయ్‌ని చంపినంత సులువుగా నన్నూ చంపొచ్చనుకుంటున్నారని, ఇప్పుడు లోకేష్‌ని (Lokesh) లక్ష్యంగా చేసుకున్నారట.. తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్‌కు పోలీసులుంటే తనకు ప్రజలు ఉన్నారన్నారు. కోతలతో విద్యా దీవెన (Vidya deevena)అమలు చేస్తున్నారని విమర్శించారు. రివర్స్ టెండర్ అంటూ పోలవరాన్ని గోదావరిలో ముంచేశారని, దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ ఎ(Diaphragm wall) క్కడుందో చెప్పే పరిస్థితి లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు నేటికీ పునరావాసం లేదన్నారు. గోదావరి (Godavari) జిల్లాల్లో పంట విరామం ప్రకటించే దుస్థితి తెచ్చారని, రాష్ట్రంలో రైతుల నెత్తిన రూ.2.75 లక్షల తలసరి అప్పు ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా 50 రోజుల్లో 50 లక్షల కుటుంబాలను కలవడమే లక్ష్యంగా ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం మొత్తం 8వేల మంది పార్టీ బృందాలను నియమించారు. ప్రచార వీడియోలను (Videos) ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాద్యమాల్లో (Social media)ప్రచారం చేస్తున్నారు. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం, ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు 7, 8 నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దాంతో పోలిస్తే ఇదేం కర్మ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకుని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -