end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సైన్స్‌ & టెక్నాలజీఈ టీకా కరోనాను సమర్థవంతంగా జయిస్తుంది..
- Advertisment -

ఈ టీకా కరోనాను సమర్థవంతంగా జయిస్తుంది..

- Advertisment -
- Advertisment -

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అమెరికాకు చెందిన ఫైజర్‌ కంపెనీ, యూరోప్‌కు చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా తయారు చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రభావవంతంగా పని చేస్తోందని ఆ కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బౌర్లా చెప్పారు. తమ ఫలితాలు తెలిసిన రోజు సైన్సుకూ, మానవాళికి విప్లవాత్మక రోజు అని అభిప్రాయపడ్డారు. మూడో దశ ప్రయోగం వల్ల తమ వ్యాక్సిన్‌.. కరోనాను అడ్డుకుంటోందని తెలుస్తోందని అన్నారు. ప్రపంచానికి అత్యవసరమైన కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే తమ నుంచి వచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు.

బయోఎన్‌టెక్‌ సీఈఓ ఉగుర్‌ సాహిన్‌ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి సెకండ్‌ వేవ్‌ రూపంలో దాడి చేస్తున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని చెప్పారు. ఫైజల్, బయోఎన్‌టెక్‌ కంపెనీలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ జూలై 27న ప్రారంభమైంది. మొత్తం 38,955 మందికి నవంబర్‌ 8 నాటికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. రెండో, మూడో దశ ప్రయోగాల్లో వచ్చిన వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించినట్లు తెలిపాయి. అయితే, పరిశీలన పూర్తయ్యే నాటికి ఈ డేటా మారే అవకాశం ఉందని ఫైజర్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఈ యేడాది చివరి నాటికి టీకా వచ్చే అవకాశాలున్నాయని వారు వెల్లడించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -