end
=
Thursday, July 4, 2024
సినీమాఈ ఇయర్‌ మొత్తం 'మెగా'ఫ్యామిలీదే..
- Advertisment -

ఈ ఇయర్‌ మొత్తం ‘మెగా’ఫ్యామిలీదే..

- Advertisment -
- Advertisment -

2021 సంవత్సరంలో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మెగా ఫ్యామిలీ హీరోల సినిమాలు వరుసకట్టనున్నాయి. ఈ ఏడాది దాదాపు పది మెగా హీరోల సినిమాలు థియేటర్లలో అభిమానులకు కనువిందు చేయనున్నాయి. ముందుగా ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘వకీల్‌సాబ్‌’ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఈ సినిమా బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌కు రిమేక్‌గా రూపుదిద్దుకుంది. పవన్‌ నటించనున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ కూడా ఇదే ఏడాది విడుదల కానుంది. ఇక మెగాస్టార్‌ చిరంజీవి మోస్ట్‌ వెయిటెడ్‌ మూవీ ‘ఆచార్య’ మేలో రిలీజ్‌ కానుంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. కాజల్‌ నాయిక పాత్ర పోషిస్తుంది. చరణ్‌ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.

ఇక రామ్‌ చరణ్‌, తారక్‌ల మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్టోబర్‌ 13న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు దర్శక దిగ్గజం రాజమౌళి డైరెక్షన్‌ వహిస్తున్నారు. మరో మెగా హీరో స్టైలిష్‌ స్టార్‌ బన్నీ కొత్త మూవీ ‘పుష్ప’ ఆగస్టు 13న, వరుణ్‌ తేజ్‌ ‘గని’ జూలై 30న, వరుణ్‌.. వెంకీల ఎఫ్‌3 ఆగస్టు 27న రిలీజవనున్నాయి. ఇక పోయినేడాదే విడుదల కావాల్సిన వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ ఫిబ్రవరి 12న వాలంటైన్స్‌ డే స్పెషల్‌గా రాబోతోంది. సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ‘రిపబ్లికన్‌’ సమ్మర్‌ విడుదల కానుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -