థామస్ కప్ ను గెలిచి భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సువర్ణాధ్యాయం లికించిన భారత జట్టు ఆటగాళ్ళకి ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఎంతగానో మెచ్చుకున్నారు. గురువారం ఒడిస్సా లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో షట్లర్ల కు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఘనంగా సత్కరించి ఒక్కొక్క ఆటగాడికి 10 లక్షల నగదు ను కానుకగా అందచేశారు. తర్వాత
ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంభాషిస్తూ బ్యాంకాక్ వేదికగా జరిగిన థామస్ కప్ లో భారత్ ఇండోనేషియా ను ఓడించి బంగారు పతకం గెలిచినందుకు గాను ఒడిస్సా ప్రభుత్వం రూ. కోటి నగదు బహుమతి ని అందచేయడం జరిగిందని అన్నారు.
భారత జట్టు ప్రతిష్టాత్మక థామస్ కప్ గెలవడం లో ముఖ్య పాత్ర పోషించడం భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులకు గర్వకారణమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు. భారత్ చీఫ్ కోచ్, ఉపాధ్యక్షుడు పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లి మెరుగైన క్రీడాకారులను తయారుచేయడం వెనుక ఎంతో కృషి ఉందని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కిదంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, స్వాతిక్ సాయిరాజ్ రంకి రెడ్డి, చిరాగ్ సెట్టి, గారగ క్రిష్ణప్రసాద్, విష్ణువర్ధన్ గౌడ్, అర్జున్, దృవ్ కపిల, ప్రియాంషు రజావత్ నగదు బహుమతి అందుకున్నవారిలో ఉన్నారు.