end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHoroscope :ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు!
- Advertisment -

Horoscope :ఆ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు!

- Advertisment -
- Advertisment -

Horoscope : సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: మాఘము. ఈ వారం మీ రాశి ఫలాలు, జనవరి 29 నుంచి ఫిబ్రవరి 4, 2023 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి.

మేష రాశి :
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉన్నది. మేష రాశి వారికి ఈ వారం ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనులయందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడును. జన్మ స్థానము రాహువు ద్వితీయ స్థానమునందు కుజుని ప్రభావంచేత మేష రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. భాగ్యములో బుధుడు, దశమంలో రవి ప్రభావము చేత ఆలోచించి తీసుకునే నిర్ణయాలు శుభఫలితాలను కలుగచేస్తాయి. మేషరాశి వారికి లాభ స్థానమునందు శని శుక్రుల సంచారముచేత చేసే ప్రతీ పని అనుకూలించును. వ్యయస్థానము నందు గురుని ప్రభావంచేత ఖర్చులు అధికముగా ఉండును. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మేష రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

వృషభ రాశి :
వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశి యందు కుజుడు, అష్టమ బుధుని ప్రభావంచేత వృషభరాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషం పట్టుదలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత కుటుంబము, స్నేహితులతో భేదాభిప్రాయములు వాగ్వివివాదములు ఏర్పడు సూచనలు కలుగుచున్నాయి. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత ఒత్తిళ్ళు వేదనలు అధికముగా ఉండును. వృషభరాశి వారికి లాభమునందు గురుడు, దశమము నందు శని, శుక్రుల ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. దశమములో శని, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. వృషభరాశి వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలించును స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. వృషభ రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని , దుర్గాదేవిని పూజించడం మంచిది.

మిథున రాశి :
మిథున రాశి వారికి ఈ వారం మధ్యస్థముగా ఉంది. మిథున రాశి వారికి అష్టమ రవి, వ్యయస్థానమునందు కుజుని ప్రభావం చేత కుటుంబము నందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. భాగ్యమునందు శని శుక్రుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉండును. దశమములో గురుని ప్రభావం చేత ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు, వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. దశమంలో గురుడు, లాభములో రాహువు అనుకూల ప్రభావం చేత సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు. ఈ వారం మరింత శుభ ఫలితాల కోసం మిథున రాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి :
కర్కాటక రాశి వారికి ఈ వారం చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించవలసిన సమయము. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. అష్టమ స్థానము శని సంచరించుట చేత కుటుంబము విషయాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి :
సింహ రాశి వారికి ఈ వారం మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారికి భాగ్యములో రాహువు, అష్టమ స్థానములో గురుని, ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. కళత్ర స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత కుటుంబ వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఈ వారం ఉద్యోగ వ్యాపారాలయందు అనుకూల ఫలితములు అధికముగా కనబడుచున్నవి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. స్త్రీలకు ఈ వారం అనుకూలముగా ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి :
కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. కన్యా రాశికి భాగ్యమునందు కుజుడు, సప్తమ స్థానము నందు గురుడు, ఆరవ స్థానము నందు శని శుక్రుల ప్రభావంచేత ఈవారం చేసే ప్రతీ పని అనుకూలించును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. చతుర్థస్థానము నందు బుధులు అనుకూలించును. పంచమ ఆరవ స్థానమునందు శని, శుక్రుల ప్రభావంచేత మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ వారం ఒత్తిళ్ళు తగ్గును. శని, గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతీ పనిలో విజయం పొందెదరు.ప్రయాణములు, దైవదర్శనములు అనుకూలించును. స్త్రీ సౌఖ్యం కలుగును. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో శ్రద్ధ వహించడం మంచిది. కన్యారాశి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :
తులా రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. పంచమంలో శని శుక్రుల అనుకూల ప్రభావంచేత తులారాశివారు చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. శత్రు స్థానములో గురుడు, ఆయు స్థానములో కుజుని ప్రభావంచేత తులారాశి వారికి శత్రు వర్గము వలన ఇబ్బందుల, కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన తులారాశివారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. జన్మరాశి యందు కేతువు, సప్తమ స్థానము నందు రాహువు ప్రభావంచేత చికాకులు, ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితములు కలుగును. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి :
వృశ్చికరాశికి ఈ వారం మధ్యస్థముగా ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం చేత, కళత్ర స్థానములో కుజుని ప్రభావంచ చేత కుటుంబ సమస్యలు, పని ఒత్తిళ్ళు అధికముగా ఉండును. వృశ్చికరాశివారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. ద్వితీయ స్థానమునందు బుధుడు, తృతీయమునందు రవి సంచారము వలన ధన లాభము కలుగును. పంచమ స్థానమునందు గురుని ప్రభావంచేత ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పని యందు ఒత్తిళ్ళు ఉన్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనుస్సు రాశి :
ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. జన్మరాశి యందు బుధుని సంచారముచేత వ్యాపారస్తలకు లాభములు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగును. ధనూరాశి వారికి కుజ , గురు గ్రహాల అనుకూల స్థితి వలన చేసే పనులయందు విజయము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ధనుస్సు రాశి వారికి ఈవారం ధనలాభము సౌఖ్యము కలుగు సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి.

మకర రాశి :
మకర రాశి వారికి ఈ వారం అనుకూలముగా లేదు. జన్మరాశి యందు రవి సంచారము చేత అనారోగ్య సమస్యలు అధికముగా మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ద్వితీయ స్థానమునందు శని శుక్రుల ప్రభావంచేత (ఏలినాటి శని ప్రభావంచేత) ఖర్చులు అధికమగును. మకరరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. వ్యయస్థానమునందు బుధుని ప్రభావం ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు చెడు సమయము. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :
కుంభ రాశి వారికి ఈ వారం చెడు ఫలితాలున్నాయి అధికముగా ఉన్నాయి. జన్మరాశి యందు శని, వ్యయస్థానమునందు రవి, చతుర్ధ స్థానమునందు కుజుని ప్రభావం చేత ధనపరమైన సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. కుంభరాశి వారు ఆర్ధిక పరమైనటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్ధిక సమస్యలు ఏర్పడు సూచన. ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు సమస్యలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభ రాశి వారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు. ఏలినాటి శని వలన చేసే ప్రతీ పని యందు కొంత ఆటంకములు ఏర్పడు సూచన. ఈవారం విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి :
మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలముగా లేదు. ఏలినాటి శని ప్రభావం మీన రాశి వారికి అధికముగా ఉన్నది. జన్మరాశి యందు గురుడు, ఏలినాటి శని ప్రభావం చేత మీన రాశి వారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాల యందు జాగ్రత్తలు పాటించాలి. దశమంలో రవి ప్రభావం చేత మీన రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగములో మధ్యస్థ ఫలితములు కలుగును. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. జన్మరాశి యందు గురుని ప్రభావం వలన ఆరోగ్య విషయముల యందు జాగ్రత్తలు వహించాలి. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -