end
=
Wednesday, April 16, 2025
వార్తలుజాతీయంసల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు
- Advertisment -

సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు

- Advertisment -
- Advertisment -

కారును పేల్చేస్తామంటూ వాట్సాప్ మెసేజ్‌

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌(Salman Khan)కు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా సల్మాన్ ప్రయాణించే కారును బాంబు పెట్టి పేల్చేస్తామంటూ(Bomb blast) వోర్లీలోని ముంబై ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయానికి సోమవారం గుర్తు తెలియని నిందితుడు వాట్సాప్ ద్వారా సందేశం పంపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో వోర్లీ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు(Police case) చేసిన పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. సల్మాన్‌కు బెదిరింపులు(Threat) ఎక్కడి నుంచి వచ్చాయన్నది కూడా ఆరా తీస్తున్నారు. సల్మాన్ నివాసం ఉంటున్న ముంబైలోని బాంద్రాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. కొంతకాలంగా సల్మాన్‌ను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హెచ్చరికలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈసారి వచ్చిన బెదిరింపుల వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. గతేడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించడం అప్పట్లో కలకలం రేపింది. సల్మాన్‌కు బెదిరింపులు ఎక్కువ కావడంతోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు వై ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించింది. 1998లో కృష్ణ జింకలను వేటాడటంతో అప్పట్లో పోలీసులు సల్మాన్ ఖాన్‌పై వణ్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సల్మాన్‌కు జైలు శిక్ష పడినప్పటికీ బెయిల్‌పై బయటకు వచ్చారు. సల్మాన్ బెయిల్‌పై బయటకు రావడాన్ని అటవీ సంరక్షకులుగా చెప్పుకునే బిష్ణోయ్ తెగకు చెందిన వారికి నచ్చలేదు. అప్పటి నుంచి సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాము ఎంతగానో ఆరాధించే కృష్ణ జింకను హత మార్చిన సల్మాన్‌ను చంపేవరకు తాము విశ్రమించబోమని బిష్ణోయ్ తెగ హెచ్చరించడం అప్పట్లో సంచలనం కలిగించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -