- 25 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్
కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి బెదిరింపు ఈమెయిల్ (e-mail) పంపిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు (Badaun in Uttar Pradesh) చెందిన 25 ఏళ్ల వ్యక్తిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ( ఏటీయస్ ) (Anti Terrorist Squad) శనివారం రాత్రి అరెస్టు చేసింది. గుజరాత్ ఏటీఎస్ (ATS) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బదౌన్‌లోని ఆదర్శనగర్ నివాసి అమన్ సక్సేనా (Aman Saxena) సోమవారం జామ్‌నగర్ (Jamnagar)లో జరిగిన ర్యాలీలో మోదీకి ప్రాణహాని ఉందని బెదిరిస్తూ ఒక మెయిల్‌ను పంపాడు. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ మెయిల్ పంపించానని సక్సేనా అన్నాడు. సక్సేనా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( IIT ) బొంబాయి (Mumbai) నుంచి బీటెక్ (B- tech) పట్టా పొందిన వ్యక్తి.
అయితే ‘ప్రధాని కార్యాలయానికి (Office) వచ్చిన బెదిరింపు ఈమెయిల్‌కు సంబంధించిన దర్యాప్తు బాధ్యతను హోం మంత్రిత్వ శాఖ గుజరాత్ ఎటీయస్‌కు (Ministry of Home Affairs to Gujarat ATS) అప్పగించింది. దాంతో ఏటీయస్ విచారణ ప్రారంభించింది. బదౌన్‌లోని ఆదర్శనగర్ నుంచి ఈ మెయిల్ వచ్చిందని మా సంస్థ గుర్తించింది’ అని ఏటీయస్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా ఇద్దరు పోలీసులు (Police) బదౌన్‌కు వెళ్లి సాంకేతిక, మానవ నిఘాను చేపట్టారు. ఆ క్రమంలోనే సక్సేనాను గుర్తించి, అతన్ని తన ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్నారని ఆ అధికారి చెప్పారు. తదుపరి విచారణ కోసం సక్సేనాను బదౌన్‌లోని పోలీసు లైన్ల (Police lines)కు తీసుకెళ్లారు.
(Shraddha Walker:అఫ్తాబ్‌ను తీసుకెళ్తున్న వ్యాన్‌పై కత్తులతో దాడి)
ఈ మేరకు ‘ఏటీఎస్‌ని క్షుణ్ణంగా జరిపిన విచారణలో తాను ప్రేమించిన అమ్మాయితో (Girl friend) సన్నిహితంగా ఉండే వ్యక్తి పేరు మీద సక్సేనా ఈ మెయిల్‌ను పంపినట్లు అతను తెలిపాడు. ఆ వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించాలని సక్సేనా భావించాడు. అయితే సాధ్యమయ్యే అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని మేము కేసు (CASE File) నమోదు చేసుకుని దర్యాప్తు చేసాము’ ఆ సీనియర్ అధికారి తెలిపారు. ఐటీ చట్టంలోని ఇతర ఆరోపణలతో పాటు అనామక కమ్యూనికేషన్ (Anonymous communication) ద్వారా బెదిరింపులు పంపినందుకు సక్సేనాపై ఏజెన్సీ ఎఫ్‌ఐఆర్ (Agency FIR) నమోదు చేస్తుందని ఆయన తెలిపారు. కాగా, ప్రాథమిక దర్యాప్తులో సక్సేనా మాత్రమే ఆ ఈమెయిల్‌ను పంపినట్లు తెలుస్తున్నదని, అయితే విచారణలో ఇంకెవరిదైనా ప్రమేయం ఉన్నట్లు తేలితే, అతన్ని లేదా ఆమెను కూడా విచారిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.