end
=
Tuesday, April 22, 2025
వార్తలుజాతీయం‘బయటకు రా.. నీ అంతు చూస్తా ! మహిళా జడ్జికి బెదిరింపులు
- Advertisment -

‘బయటకు రా.. నీ అంతు చూస్తా ! మహిళా జడ్జికి బెదిరింపులు

- Advertisment -
- Advertisment -

చెక్ బౌన్స్‌ కేసు(Check bounce case)లో ఓ మ‌హిళా జ‌డ్జి(Woman judge) నిందితుడి(Accused)కి శిక్ష ఖరారు చేశారు. దీంతో నిందితుడు కోపంతో ఊగిపోయాడు. కోర్టు(Court)లోనే ‘బయటకు రా.. నీ అంతు చూస్తా’ అని బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో చోటుచేసుకోగా ఆల‌స్యంగా అస‌లేమైందంటే.. ఢిల్లీ కోర్టులో ఏప్రిల్ 2న‌ చెక్ బౌన్స్ కేసు హియ‌రింగ్‌కు వ‌చ్చింది. జ‌డ్జి శివంగి మంగ్లా విచార‌ణ చేప‌ట్టారు. ఇరువర్గాల వాద‌న‌లు విన్న జ‌డ్జి అనంత‌రం నిందితుడు దోషి అని తేల్చారు. ఈ కేసులో నిందితుడితో పాటు అత‌డి త‌ర‌ఫు న్యాయవాది కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

తదుపరి విచారణ తేదీలోగా లిఖితపూర్వకంగా త‌మ‌ స్పందన తెలియజేయాలని అత‌డి త‌ర‌ఫు న్యాయవాదిని ఆదేశించారు. తీర్పు విన్న నిందితుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఒక వస్తువును జడ్జిపైకి విసిరేందుకు ప్రయత్నించాడు. ‘బయటకు రా నీ సంగ‌తి చెప్తా. నువ్వు సజీవంగా ఇంటికి తిరిగి ఎలా వెళ్తావో చూస్తా` అంటూ పెద్ద స్వ‌రంతో వార్నింగ్ ఇచ్చాడు. న్యాయ‌వాది కూడా చిందులు వేస్తూ గ‌గ్గోలు పెట్టాడు. దీంతో జడ్జి ఖిన్నురాల‌య్యారు. ఘటన త‌న‌ను మానసిక వేదనకు గురి చేసింద‌ని, ఒక దశలో రాజీనామా చేయాలని భావించినట్లు మహిళా న్యాయమూర్తి వాపోయారు.

నిందితుడితో పాటు అత‌డి న్యాయ‌వాదిపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశాన‌ని వెల్ల‌డించారు.

 

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -