end

వరుణుడు కారణం గా మూడు రోజులు సెలవులు…

గత మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా తెలంగాణలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. మరో మూడు రోజులపాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి బుధవారం వరకు విద్యాసంస్థలన్నింటికీ సెలవులు ప్రకటించింది.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున మంత్రులు, అధికారులతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. వర్ష ప్రభావిత ప్రాంతాలు, ప్రస్తుత పరిస్థితి గురించి ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు అప్రమత్తమైంది. మూడు రోజులపాటు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం నుంచి మళ్లీ విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి.

Exit mobile version