సికింద్రాబాద్ నడిబొడ్డున జరిగిన భారీ (Fire accident) అగ్నిప్రమాదం నగరవాసులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. డెక్కన్ నైట్‌వేర్ స్టోర్ (Deccan Nightwear Store) ఉన్న ఆరంతస్తుల భవనంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు.. చుట్టు పక్కల ప్రజలకు ఊపిరాడకుండా చేశాయి.ఉదయం 10.30 సమయంలో కార్‌డెకర్స్‌లో షార్ట్ సర్క్యూట్ (Short circuit in the card deckers)తో మంటలంటుకున్నాయి. కాసేపటికి ఆరంతస్తుల వాణిజ్య భవనమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఉదయం 10.45కల్లా.. సెల్లార్‌కూ మంటలు, పొగలు వ్యాపించాయి. ఆ తర్వాత దట్టమైన పొగ వెలువడగా.. మధ్యాహ్నం వరకు కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు, పొగలను అదుపుచేసేందుకు ప్రయత్నించారు. అప్పటి వరకు కార్‌డెకర్స్, సెల్లార్లలో మంటలు ఆరిపోయి.. కేవలం పొగలే వస్తున్నాయని భావించారు. 4, 5 అంతస్తుల్లో ఉన్న ఇంటీరియర్ వర్కర్లు ముగ్గురిని (There are three interior workers), 2, 3 అంతస్తులో నలుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. పరిసరాల్లోని దుకాణాలు, ఇళ్లు, కిమ్స్ హాస్టల్‌లో ఉన్నవారిని ముందుజాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారు. మధ్యాహ్నానికి మంటలు ఉధృతమయ్యాయి. మొదటి రెండు అంతస్తుల్లో ఉన్న గోదాములకు మంటలు వ్యాపించడం.. అందులో టీషర్ట్‌లకు సంబంధించిన థాన్లు భారీ మొత్తంలో ఉండడంతో వేగంగా విస్తరించాయి.
Police and firemen పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల కథనం ప్రకారం.. కిమ్స్ సమీపంలోని ఆరంతస్తుల భవనంలోని రెండు సెల్లార్లలో ఒకదాంట్లో ‘దక్కన్ మాల్’ పేరుతో కార్పొరేట్ స్కూళ్ల యూనిఫారాల దుకాణం, ‘దక్కన్ నైట్‌వేర్’ పేరుతో స్పోర్ట్స్‌వేర్ స్టోర్ (A corporate school uniform store, a sportswear store named ‘Dakkan Nightwear’)కొనసాగుతున్నాయి. రెండో సెల్లార్‌లో ప్రింటింగ్‌కు సంబంధించిన కలర్ కెమికల్స్ గోదాము ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో కార్ డెకర్స్, సెల్లార్‌లో (Car decors on the ground floor, in the cellar) ఉన్న వస్త్ర దుకాణాలకు సంబంధించిన గోదాములు పైరెండు అంతస్తుల్లో ఉన్నాయి. ఈ షోరూంలను డీవీకాలనీకి చెందిన జావీద్ నిర్వహిస్తున్నారు
.
సాధారణంగా ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే.. అగ్నిమాపక సిబ్బంది ఒకటి రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తీసుకొస్తారు. కానీ గురువారం ఉదయం రాంగోపాల్ పేటలో (Ramgopal Peta) జరిగిన అగ్నిప్రమాదం మాత్రం చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. మంటలను అదుపు చేసేందుకు దాదాపు పది గంటల సమయం పట్టింది. ఆ భవనంలో ఉన్న సామాగ్రి మొత్తం కాలిపోయిన తర్వాతే మంటలు అదుపులోకి వచ్చాయి. ఏకధాటిగా 10 గంటల పాటు తగలబడడమంతో భవనం మొత్తం ధ్వంసమైంది. ఈ ఘటనలో ప్రాణ నష్టం కూడా జరిగినట్లు తెలుస్తోంది.
ఇద్దరు ఫైర్‌మెన్‌కు గాయాలు.. ఒకరికి సీరియస్
మంటలను అదుపు చేసే యత్నంలో నరసింగరావు, ధనుంజయ్‌రెడ్డి అనే ఇద్దరు ఫైర్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. స్కైలిఫ్ట్ ద్వారా మంటలను అదుపు చేస్తుండగా.. ఒక్కసారిగా మంటలు, పొగ పైకిరావడంతో కిందకు దూకేశారు. దీంతో కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని హోంమంత్రి మహమూద్ అలీ (Home Minister Mahmood Ali) తెలిపారు. సాయంత్రం 7 గంటలకు ఆయన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాద కారణాలను అక్కడే ఉన్న అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, హైదరాబాద్ పోలీసు అదనపు కమిషనర్ విక్రమ్‌సింగ్ మాన్, మధ్యమండలం డీసీపీ రాజేశ్‌చంద్రను (DCP Rajeshchandra) అడిగి, తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ముగ్గురు యువకులు లోనికి వెళ్లి, తిరిగి రాలేదని, వారి ఉనికిని కనుగొనేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారన్నారు. కాలనీల్లో ఇలాంటి గోదాములు ఉండడమేంటని ఆయన అధికారులను ప్రశ్నించారు.
అగ్ని ప్రమాదం జరిగిన భవనం అక్రమ నిర్మాణం అని తెలుస్తోంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి బంధువు ఒకరు దాన్ని నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. 2014 వరకు ఈ భవనంలో సెట్‌బ్యాకులు లేకుండా.. రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్, మరో మూడంతస్తులు ఉండగా.. ఆ ప్రజాప్రతినిధి బంధువు జోక్యంతో మరో రెండు అంతస్తులను అదనంగా నిర్మించినట్లు తెలిసింది. అధికారపార్టీ నేత కావడంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులు అటువైపు కన్నెత్తి చూ డలేదనే విమర్శలున్నాయి. నిజానికి సెల్లా ర్లు లేకుండా.. జీ+3 అంతస్తులకు నివాస కేటగిరీలో 2006లో ఆ భవనానికి అనుమతులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ, పూర్తిగా వాణిజ్య అవసరాలకు ఆ భవనా న్ని వాడుతున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భవన క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎ్‌స)కు దరఖాస్తు చేశారని, 2016లో ఆ భవనాన్ని ప్రస్తుత రహీంఖాన్‌కు విక్రయించారని స్థానికులు చెబుతున్నారు.ఆ తర్వాత ఆయన ఒక సెల్లార్, 2, 3 అంతస్తులను ఇతరులకు విక్రయించారంటున్నారు.
అయితే దట్టమైన పొగ కారణంగా ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఇప్పటివరకు భవనంలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. భవనంలో ఇక ఎవరూ లేరని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మరోపక్క, డెక్కన్ స్పోర్ట్స్ మాల్ కు పక్కనే ఉన్న నాలుగు భవనాలకు కూడా మంటలు వ్యాపించినట్టు తెలుస్తోంది. పరిసరాల్లోని భవనాల్లో నివసిస్తున్న వారిని అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. అంతేకాదు, ఆ ప్రాంతంలో ముందుజాగ్రత్తగా విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారు.
(KERALA:విద్యార్థినులకు రుతుచక్రం, ప్రసూతి సెలవులు)