- చెట్టును ఢీకొన్న కారు, ముగ్గురు యువకులు మృతి
అతివేగంగా వస్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాధకర ఘటన తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన పర్ణసాయి, పులి ప్రవీణ్‌కుమార్, కొత్తగూడెంకు చెందిన భరత్ పర్యాటక ప్రాంతాలను చూడడానికి విజయవాడ నుండి మారేడుపల్లికి కారులో బయలుదేరారు.
సిఎంఆర్ఎఫ్ నకిలీ చెక్కులతో విత్‌డ్రా యత్నం
అయితే కారును అతివేగంగా నడపడం వల్ల అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారంతా నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రవీణ్, పర్ణసాయి, భరత్‌లు అక్కడే మరణించారు. వీరితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణం అతివేగమే అని నిర్ధారించారు.