భారతీయ స్టేట్ బ్యాంకులో చోరికి యత్నించి విఫలమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని రేంజల్ మండలం సాటపూర్ ఎస్‌బిఐ బ్యాంకులో కొందరు దుండగలు చోరీకి యత్నించారు.
బ్యాంకు కిటికీలు పగులగొట్టి లోపలికి వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు క్లూస్ టీమ్‌తో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దొంగల వెలిముద్రలు, సాక్ష్యాల కోసం క్లూస్ టీమ్ ప్రయత్నం చేస్తోంది. అయితే బ్యాంకులో డబ్బుపోయిందా? ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారా? అన్న సమాచారం తెలియాల్సి ఉంది.