end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంపెద్దపులి దాడిలో ఆవు మృతి
- Advertisment -

పెద్దపులి దాడిలో ఆవు మృతి

- Advertisment -
- Advertisment -
  • పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం

మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో పెద్దపులి కొద్ది రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. అడవులకు మేతకు వెళ్లిన పశువులపై తన పంజా విసురుతోంది. ఇప్పటికే భీమారం మండల కాజీపేటలో రెండు పశువులను చంపేసింది. తాజాగా మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం ధర్మారం బుగ్గగుట్టలో ఆవుపై పెద్దపులి దాడి చేసింది. దీంతో ఆవు మృతిచెందింది. పులి మంచిర్యాల, పెద్దపల్లి అటవీ ప్రాంతంలోనే ఎక్కువగా సంచిరిస్తోందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

భారత్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి Poco M2

అలాగే ముత్తారం, సీతంపేట గుట్ట ప్రాంతాలలో కూడా పెద్దపులి సంచరించింది. మానేరు వాగు వద్ద పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం ముత్తారం మండలం మచ్చుపేట అడవుల్లో ఆరు పెద్ద పులులు సంచరించాయి. పశువుల మందపై దాడి చేయగా ఒక ఆవు మృతి చెందింది. ఇది గమనించిన పశువుల కాపరి భయంతో కేకలు వేయగా పులి అడవిలోకి పారిపోయింది. ఏదేమైనా మంచిర్యాల, పెద్దపల్లి ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రిపూట అడవీలో నుండి గ్రామాల్లోకి పెద్దపులి ప్రవేశిస్తే పరిస్థితి ఏంటి?

ఏపీలో ‘ఆపిల్‌’ తయారీ యూనిట్‌

తెలంగాణ పాలిటెక్నిక్‌ ప్రవేశ షెడ్యూలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -