Pregency Belly : ప్రసవం సహజ సిద్ధమైన ప్రక్రియ. కానీ దీని తర్వాత శరీరంలో అనేక రకాల మార్పులొస్తాయి. ముఖ్యంగా కొంతమందిలో చర్మంపై చాలా ప్రభావం పడుతుంది. పొట్ట ఉబ్బుగా, ఎత్తుగా, లూజ్ గా ఉంటుంది. అలాగే సాగిపోయినట్టు కనిపిస్తుంది. గర్భధారణ(pregency)లో స్ట్రెచ్ మార్క్స్ మొదలవుతాయి. కొన్ని రోజులకి కొంతమందిలో ఈ చర్మం సాధారణ స్థితికి చేరకుంటుంది. కానీ చాలా మందిలో అలానే ఉండిపోతుంది. డెలివరీ(delivery) అయ్యాక చాలా మందిలో పొట్ట, నడుము భాగంలో కొవ్వు పెరిగిపోయి లావుగా తయారవుతుంటారు. దాంతో కొందరు అసహ్యంగా భావించి నలుగురిలో కలవాలన్నా, బయటకు రావాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. పెరిగిన పొట్టను తగ్గించుకోవటానికి అవి ఇవి చేస్తూ ఉంటారు. కానీ ప్రయోజనం ఉండదు. చాలా మంది పొట్ట తగ్గటానికి విపరీతంగా డైటింగ్(Dieting) చేస్తూ ఉంటారు. కానీ పొట్ట తగ్గకుండా నీరసం, నిస్సత్తువ రావటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల (health complications) బారినపడతారు.డెలివరీ తర్వాత వచ్చే పొట్టను సులభంగా తగ్గించుకోవటానికి చిట్కాలను(Easy Home Remedies) ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది.
(Garlic : వెల్లుల్లితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో…)
మన వంటింట్లోనే లభించే కొన్ని రకాల మసాల దినుసులతో బెల్లి ఫ్యాట్(belly fat) కు చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగానే యాలకులు, సోంపుతో కలిసి చేసే కషాయం ప్రసవం తర్వాత వచ్చే పొట్టను తగ్గించుకునేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో 2 కప్పుల నీరు, 4 యాలకులు, 1 స్పూన్ సోంపు వేసి మరిగించాలి. ఈ నీటిని వడగట్టి పరగడుపున గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగాలి. ఈ విధంగా పరగడుపున త్రాగటం వలన జీవక్రియ రేటు పెరిగి పొట్టలో కొవ్వు కరుగుతుంది. పైగా తల్లిపాలను పెంచటంలోనూ ఈ కషాయం తొడ్పడుతుంది. ఈ నీటిని తాగిన10 నిమిషాల తర్వాత పొట్ట మీద నువ్వుల నూనె రాసి సున్నితంగా మర్దన చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కాపడం పెట్టుకోవాలి. దాంతో పొట్ట మీద కండరాలు గట్టిగా మారతాయి. ఇలా చేయటం వలన డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మార్క్స్(Strech Marks) కూడా కొద్దిగా కొద్దిగా తొలగిపోతాయి. తర్వాత పొట్టకు సంబందించిన వ్యాయామాలు చేసి అనంతరం స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు చేస్తూ ఉంటే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నడుం చుట్టు సన్నబడుతుంది. రోజుకు కనీసం 20 నిమిషాలపాటు స్విమ్మింగ్ మంచిది.