end
=
Tuesday, April 1, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంHealth Tip: ఈ చిట్కా పాటిస్తే చాలు.. దగ్గు క్షణాల్లో మాయం!!
- Advertisment -

Health Tip: ఈ చిట్కా పాటిస్తే చాలు.. దగ్గు క్షణాల్లో మాయం!!

- Advertisment -
- Advertisment -

 

వర్షాకాలం, చలికాలం వచ్చింది అంటే ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. ఎందుకు అంటారా ఈ వర్షాకాలం(Rainy season) చలికాలం లో జలుబు దగ్గులు రావడం సహజం. చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరికి ఐనా వస్తుంది. వాతావరణ మార్పు రాగానే వచ్చేవి ఇవి కదా. ఈ రోజుల్లో దగ్గు వస్తే ఇబ్బంది అది పనిగా దగ్గడం వల్ల పక్కన వాళ్ళు ఏమి అనుకుంటారో అనే భావనా ఉంటుంది. . అందుకే త్వరగా తగ్గించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దగ్గును తగ్గించుకోవాలంటే ముందు అది ఎందుకు వస్తుంది అని  మనకు తెలియాలి. మన శరీరంలో కీలకమైన ఊపిరి తిత్తుల (Lungs)లోకి సూక్ష్మక్రిములు వల్ల అక్కడి కణజాలాన్ని తింటూ అన్నీ రోగాలూ వచ్చేలా చేస్తాయి.దగ్గు తీవ్రత పెరిగితే క్షయ (Tuberculosis) వంటి వ్యాధులకు దారితీస్తుంది. కొన్ని సహజ పద్ధతుల్ని పాటిస్తే దగ్గు తగ్గిపోతుంది.

 (దోమలకి చెక్ పెట్టండి ఇలా…)

ఆవిరి పట్టండి: ఇది మన తెలుగు వారికి ఎక్కువగా తెలిసిన చిట్కా. ఓ గిన్నెలో వేడి నీరు పోసి కొద్దిగా పసుపు వేసి  దుప్పటి కప్పుకొని ఆవిరిని పీల్చాలి. ఇలా చెయ్యడం వల్ల మ్యూకస్‌ (Mucous)లో కణాలు నాశనం అయి శ్వాస చక్కగా రావడానికి సహాయపడుతుంది.ఆవిరి అనేది యాంటీసెప్టిక్‌లా పనిచేస్తూ గొంతులో, ముక్కులో బ్యాక్టీరియా, క్రిములను చంపేస్తుంది.

వేడి నీరు, తేనె: ఇది ఊపిరి తిత్తులకు కావాల్సిన మాయిశ్చర్ అందిస్తుంది. ఇది ఆహార నాళం, శ్వాసకు ఎంతో మేలు చేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలలో తేనె వేసుకొని తాగండి.దగ్గు వచ్చే వారికి ఉపశమనం కలిగిస్తుంది.

నిమ్మ రసం: నిమ్మరసంలో విటమిన్ C ఉంటుంది. ఇది వ్యాధి నిరోధక శక్తి(Resistance)ని పెంచుతుంది. ఉసిరి కాయల్లో కూడా ఇది ఎక్కువగానే ఉంటుంది. నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. దగ్గు వల్ల కలిగే గొంతు నొప్పి, చికాకును తగ్గిస్తుంది.

 మ్యులేథి (Mulethi – Liquorice): ఈ పుల్లల్ని నమిలితే కూడా దగ్గు తగ్గుతుంది. ఇప్పుడు ఇవే పుల్లల్ని పౌడర్ రూపంలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అమ్ముతున్నారు. ఆ పొడిని టీ, అల్లం టీ, మిరియాల టీతో కలిపి, తక్కువ షుగర్ వేసుకొని తాగితే మేలు జరుగుతుంది. ఇన్ని సహజ పద్ధతులు పాటించినా దగ్గు తగ్గట్లేదంటే అప్పుడు మందులు వాడాల్సి ఉంటుంది. మందులకూ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -