end
=
Monday, January 20, 2025
క్రీడలుCricket:నేడే దాయాదుల పోరు..
- Advertisment -

Cricket:నేడే దాయాదుల పోరు..

- Advertisment -
- Advertisment -

  • విజయంతో టోర్నీ ఆరంభించిన భారత్
  • అదే ఊపు కొనసాగించేలా కసరత్తులు
  • లాస్ట్ ఇయర్ ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలంటున్న ఫ్యాన్స్

ఈ యేడాది పొట్టి ప్రపంచ‌కప్ (T20 world cup)సూపర్-12 (super 12) రౌండ్ మ్యాచ్‌లు (Round match)శనివారం మొదలయ్యాయి. గ్రూప్-1 తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ (New Zealand)89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను (Australia) ఓడించగా.. ఆ తర్వాత ఇదే  గ్రూప్ నుంచి ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ (England, Afghanistan) మధ్య మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ దెబ్బకు అఫ్ఘాన్ విలవిలలాడింది. పెర్త్‌లోని (Perth) ఆప్టస్ స్టేడియంలో జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లో ఇరు జట్లు బౌలర్లు పై సత్తా చాటారు. సుదీర్ఘ గాయం తర్వాత జట్టులోకి తిరిగి వచ్చిన లెఫ్టార్మ్ మీడియం ఇంగ్లాండ్ పేసర్ శామ్ కరన్ (shyam)5 వికేట్లు (wickets) కూల్చి రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఆదివారం గ్రూప్ 2 నుంచి దాయాదుల పోరు మొదలవనుండగా.. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరి ఇరుజట్ల బలాబలాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

ఆస్ట్రేలియాతో (Australia)జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచి టోర్నీ(tourney)ని విజయంతో ఆరంభించిన భారత్ (India).. అదే ఊపు కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ (last)పాక్ చేతిలో ఓటమికి ప్రతికారం తీర్చుకోవాలనే కసితో కూడా ఉత్సహం చూపుతోంది. అలాగే 2007 తర్వాత భారత జట్టు మరో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను (title)గెలవలేదు. ఈసారి ఈ ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతుండగా, రోహిత్ శర్మ (rohit Sharma)సారథ్యంలోని టీమ్ ఇండియా విజయం కోసం బలమైన పోటీదారులలో ఒకటిగా నిలిచింది. ఇందుకోసం టీమ్ ఇండియా సిద్ధమై అత్యుత్తమ ఆటగాళ్లతో అస్ట్రేలియా చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దేగే 11 మంది ఆటగాళ్లు (players)ఎవరో మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత టీమ్ ఇండియా వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడింది. ఒకటి గెలిచింది (won). మరొకదాంట్లో ఓడింది (loss). ఆ తర్వాత భారత జట్టు రెండు వార్మప్ (warm match) మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఆడిన మొదటి మ్యాచ్‌లో విజయం సాధించగా, న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు (cancel)అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదంతా పక్కనే పెడితే ఇంతకు ప్లేయింగ్ లెవన్ ఎలా ఉండబోతుందనే అంచానాలను ఓ సారి పరిశీలిద్దాం.

బ్యాటింగ్ ఆర్డర్..

ఇండియా బ్యాటింగ్ (batting) విషయానికొస్తే.. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (rahul) ఓపెనర్లుగా (openers) బరిలోకి దిగనున్నారు. రోహిత్ ఫామ్ టీమ్ ఇండియాకు ఆందోళన కలిగిస్తోంది. విరాట్ కోహ్లీ(Virat kohli) నంబర్-3లో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే సూర్యకుమార్ (surya) యాదవ్ కూడా నంబర్-4లో ఫిక్స్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా (hardik) ఐదో స్థానంలో బరిలోకి దిగనుండగా, దినేష్ కార్తీక్ (karthik)తర్వాతి స్థానంలో రానున్నాడు. ఇద్దరూ ఫినిషర్స్ (finishars) పాత్రలో ఉండగా వీరిద్దరిపై టీమిండియా ఎన్నో ఆశలు పెట్టుకుంటోంది.

ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు:

టీమ్ ఇండియా ఇద్దరు స్పిన్నర్లతో (spin) ముగ్గురు ఫాస్ట్ (fast)బౌలర్లతో (bowler) వెళుతుందా లేదా ఇద్దరు స్పిన్నర్లకు బదులుగా ఒక బ్యాట్స్‌మెన్‌కు (batsmen) అవకాశం (chance)ఇవ్వాలనుకుంటుందా అనేది మొదటి ప్రశ్నగా నిలిచింది. మొదటి పరిస్థితిలో పాండ్యా కూడా ఉన్నందున ఆరు బౌలింగ్ ఎంపికలు ఉంటాయి. కానీ, రెండవ స్థానంలో అది సాధ్యం కాదు. ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని టీమిండియా నిర్ణయించుకుంటే అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లలో (Akshar Patel, Ravichandran Ashwin) ఒకరు రానున్నారు. అయితే వీరిద్దరూ బ్యాటింగ్ చేయగలగడం భారత్‌కు కలిసొచ్చే అంశమే.

ప్రధాన స్పిన్నర్‌..

యంగ్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal)ప్రధాన స్పిన్నర్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇద్దరు స్పిన్నర్లతో వెళ్లడం భారతదేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా మైదానాలు (grounds)పెద్దవిగా ఉంటాయి. బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తుంటారు. కాబట్టి వికెట్లు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

(Diwali:పటాసులు పేల్చితే 6 నెలల జైలు శిక్ష..)

ముగ్గురు ఫాస్ట్ బౌలర్లయితే..

జస్ప్రీత్ బుమ్రా (bumrah) స్థానంలో మహమ్మద్ షమీ (shami)చోటు సంపాదించుకున్నాడు. షమీ మొదటి వార్మప్ మ్యాచ్‌లో ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయగా.. ఒకే ఓవర్ లో  మూడు వికేట్లు తీసి ప్లేయింగ్-11 కోసం సిద్ధమనే సిగ్నల్ పంపించాడు. అతనితో పాటు, అర్ష్‌దీప్ సింగ్, (arshdeep) భువనేశ్వర్ కుమార్, (bhuvi) హర్షల్ పటేల్ (harshal patel)మధ్యే అసలు పోరు నడుస్తోంది. ఇక సీనియారిటీ పరిగణలోకి తీసుకుంటే భువనేశ్వర్ బరిలోకి దిగే కనిపిస్తుండగా.. ఫిల్డింగ్ విషయంలోనూ కాస్త ఆందోళన పడే చాన్స్ ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగిన మ్యాచ్ లో చాలా క్యాచ్ లు నేలపాలు చేయడమే కాకుండా మిస్ ఫీల్డ్ కారణంగా భారీ పరుగులు సమర్పించారు.

భారత ప్రాబబుల్ ప్లేయింగ్ XI

రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, యుజువేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -