end

నేడే బిహార్‌ అసెంబ్లీ తుది సమరం

ఇవాళ బిహార్ అసెంబ్లీకి జరగనున్న చివరి దశ పోలింగ్ జరుగుతోంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికల్లో 1204 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 2.34 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, ఇవే తన చివరి ఎన్నికలని ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్‌ ప్రచార సభల్లో చెప్పడం, కుటుంబ పాలన లేకుండా ఉండాలంటే నితీష్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ప్రధాని మోదీ ఓటర్లకు పిలుపునివ్వడం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. సీఎం నితీష్‌కు మచ్చలేని మహానేతగా పేరుంది. పైగా జేడీయూకు బీజేపీ మద్దతు ఇవ్వడం ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. మరోవైపు ఆర్జేడీలో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఆ పార్టీ కాంగ్రేస్‌, వామపక్షాలతో జట్టు కట్టింది. చూడాలి మరి బిహార్ ఓటర్లు ఎవరికి మద్దతునిస్తారో.

Exit mobile version